రెండో టీ20 : ఇండియా టార్గెట్ 159

ఆక్లాండ్ లో జరుగుతున్న కీలకమైన రెండో టీట్వంటీలో లోకల్ టీమ్ న్యూజీలాండ్ 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇండియాకు 159 రన్స్ టార్గెట్ ఇచ్చింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది న్యూజీలాండ్. ఫస్ట్ టీట్వంటీ హీరో సీఫర్ట్ ను భువనేశ్వర్ కుమార్ ఔట్ చేశాడు. ఆ తర్వాత మన్రో, విలియంసన్, మిషెల్ లను కృణాల్ పాండ్యా ఔట్ చేశాడు. 50/4 స్కోరుతో డీలాపడిన కివీ జట్టును.. టేలర్(42) , గ్రాండ్ హోమ్(50) ఆదుకున్నారు. 20 ఓవర్లలో 158/8 స్కోరు చేసింది న్యూజీలాండ్. కృణాల్ పాండ్య 3, ఖలీల్ అహ్మద్ 2,  భువీ 1, హార్దిక్ 1 వికెట్ పడగొట్టారు.

Latest Updates