మూడో టీ20 మ్యాచ్ టై : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

హామిల్టన్‌ : న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై అయ్యింది. బుధవారం న్యూజిలాండ్ కు అచ్చొచ్చిన సెడాన్‌ పార్క్‌ వేదికగా  జరిగిన ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన కివీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 రన్స్ చేసింది. టీమిండియాకు మంచి ప్రారంభం దక్కింది. స్టార్టింగ్ నుంచే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ(67) హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించాడు.  ఆ తర్వాత లోకేష్ రాహుల్, రోహిత్, శివమ్ దూబే ఔట్ కావడంతో రన్ రేట్ తగ్గింది. చివర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించడంతో భారత్ గౌరవప్రధమైన స్కోర్ చేసింది. 180 టార్గెట్ తో బరిలోకి దిగిన కివీస్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది.

ఓవర్ కు కావాల్సి రన్స్ చేస్తూ భారత బౌలర్లను టెన్షన్ లో పడేసింది. అయితే 5, 6 ఓవర్లలో వెంటవెంటనే ఓపెనర్లు ( గుప్టిల్(31), కొలిన్ మున్రో(14)) కీలక వికెట్లు  కోల్పోవడంతో కాస్త స్కోర్ నెమ్మదించింది. ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్ (95 హాఫ్ సెంచరీ) బౌండరీలు, సిక్సర్లు కొడుతూ టార్గెట్ ను ఫినిస్ చేసేలా కనిపించాడు. 6 సిక్సులు, 8 ఫోర్లతో రెచ్చిపోయి ఆడుతూ  భారత ప్లేయర్లను టెన్షన్ లో పడేశారు. చివరి వరకు నువ్వా.. నేనా అనేలా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ .. లాస్ట్ కి టైగా ముగిసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన కివీస్ 179 రన్స్ చేసింది. సూపర్ ఓవర్ లో ఫలితం తేలనుంది.

see also: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

నిర్భయ దోషుల ఉరి అమలుకు లైన్ క్లీయర్

వైరల్ వీడియో: జింకను గన్‌తో కాల్చి.. కత్తితో గొంతు కోసిన వ్యక్తి

బీజేపీలోకి బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్

Latest Updates