భారత్-పాక్ మ్యాచ్ ఉంటుంది : ICC

న్యూఢిల్లీ: భారత్‌ – పాక్‌ ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో రెండు దేశాల మధ్య వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ పై సందేహాలు తలెత్తాయి. అయితే షెడ్యూల్‌‌‌‌ ప్రకారమే వరల్డ్‌ కప్‌ కొనసాగుతుందని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ (ఐసీసీ) సీఈఓ డేవ్‌ రిచర్డ్సన్‌ తెలిపాడు. వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌లో ఎలాంటి మార్పులు ఉంటాయని తాను అనుకోవటం లేదని అన్నారు. మే నెల చివర్లో ఇంగ్లండ్‌ లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌ లో భాగంగా ఇండియా – పాకిస్తాన్‌ జూన్‌ 16న మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌లో తలపడనున్నాయి. అయితే పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌ తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడొద్దని హర్భజన్‌ తో పాటు క్రికెట్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా కూడా వాదన తెరమీదకు తెచ్చింది.

దీంతో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ పై సందేహాలు నెలకొన్నాయి. దీనిపై రిచర్స్డన్‌ వివరణ ఇస్తూ ‘ ఆ మ్యాచ్‌ రద్దవుతుందని అనుకోవటం లేదు’ అని అన్నాడు. కార్గిల్‌‌‌‌‌‌‌‌  వార్‌‌‌‌‌‌‌‌ సమయంలో ఇంగ్లం డ్‌ లో జరిగిన 1999 వరల్డ్‌ కప్‌ లో భారత్‌ –పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ జరిగిందని ఆయన గుర్తు చేశాడు. పుల్వామా దాడి తర్వాత పాకిస్తాన్‌ క్రికెటర్ల ఫొటోలను భారత్‌ లోని పలు క్రికెట్‌ సంఘాలు తొలగించాయి. దీనిపై వచ్చే నెలలో జరిగే ఐసీసీ సమావేశంలో తేల్చుకుంటామని పాకిస్తాన్‌ తెలిపింది. భారత్ -పాక్ తో మ్యాచ్ నిలిపివేయడపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. పాక్ తో మ్యాచ్ అడాలి..భారత్ గెలవాలి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Latest Updates