చేతులు కలపం.. మీకో దండం.. : పాకిస్థాన్ కు ఇండియా పంచ్

పుల్వామా టెర్రర్ ఎటాక్ తర్వాత.. దౌత్యపరంగా పాకిస్థాన్ విషయంలో భారత్ దృష్టి కోణం మారింది. అంతర్జాతీయ వేదికపై ఆ విషయాన్ని మనదేశం తాజాగా నిరూపించింది. టెర్రరిజాన్ని భారత్ పైకి ఉసిగొల్పుతూ అశాంతి రేపేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ను….  ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో ఉంది ఇండియా. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ కు వీలైనంత డిస్టెన్స్ లో ఉంచుతోంది. నెదర్లాండ్స్ దేశం… ది హేగ్ నగరంలోని అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇలాంటిదే ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది.

భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ అప్పగింత కేసులో సోమవారం నుంచి 4 రోజుల పాటు అంతర్జాతీయ న్యాయస్థానంలో వాదనలు కొనసాగుతున్నాయి. తొలిరోజు ఇండియా వాదనలు వినిపించింది. రేపు పాకిస్థాన్, ఎల్లుండి మళ్లీ ఇండియా.. ఆ తర్వాత పాకిస్థాన్ వివరణలు ఉంటాయి. ఇవాళ ఉదయం కోర్టులో సమావేశం అయ్యేటప్పుడు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికారి, అటార్నీ జనరల్ అన్వర్ మన్సూర్ ఖాన్.. భారత ప్రభుత్వ ప్రతినిధి దీపక్ మిట్టల్ ను విష్ చేస్తూ… షేక్ హ్యాండ్ ఇచ్చాడు. దీనికి దీపక్ మిట్టల్ సింపుల్ గా రిప్లై ఇచ్చారు. అన్వర్ మన్సూర్ ఖాన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా… దండం పెట్టారు. నమస్కారంతోనే సరిపెట్టారు. కొద్దిసేపు చేయి చాచి… షేక్ హ్యాండ్ ఇవ్వాలని మన్సూర్ ఖాన్ అడిగినా… దీపక్ మిట్టల్ చేయి కలపలేదు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి తన చైర్ లో కూర్చున్నారు పాక్ అటార్నీ జనరల్.

నమస్కారం భారత సంస్కృతిలో భాగమే అయినా… పాకిస్థాన్ పట్ల ఇండియా వైఖరిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించినట్టయింది.

Latest Updates