భారత్, పాక్ మధ్య పరిస్థితులు చల్లబడ్డాయి: ట్రంప్

భారత్, పాకిస్థాన్ మధ్య రెండు వారాల క్రితం ఉన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడిన ట్రంప్..భారత్ పాక్ మధ్య ఇంతకు ముందున్న వాతావరణం లేదని..పరిస్థితులు చల్లబడ్డాయన్నారు. ఇరు దేశాలు కోరుకుంటే వారికి సాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాని..ఆ విషయం వారికి కూడా తెలుసన్నారు ట్రంప్.

కొన్ని రోజుల క్రితం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో భేటీ సందర్భంగా  కశ్మీర్ విషయంలో భారత్,పాక్ మధ్య మధ్యవర్తిత్వానికి తాను రెడీ అని ట్రంప్  అన్నారు. అయితే దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. దీంతో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు.

Latest Updates