భారత అంతర్గత విషయాల్లో మీ జోక్యం అనవసరం

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడో చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. ఈ మేరకు కెనడా హైకమిషనర్‌‌కు భారత్ తన నిరసనను తెలియజేసింది. భారత్‌‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రైతుల నిరసనలకు తాము మద్దతు తెలుపుతున్నామని ట్రుడో రీసెంట్‌‌గా పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌‌పై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘భారత రైతుల నిరసనల విషయంలో కెనడా లీడర్లు చేస్తున్న కామెంట్లు సరికావు. మా దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి కామెంట్లు రిపీట్ అయితే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతింటాయి’ అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఒక ప్రజాస్వామ్య దేశపు అంతర్గత విషయాల్లో అనవసర జోక్యం చేసుకునేలా ఉన్న కెనడా నేతల కామెంట్లు సరికాదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు.

Latest Updates