రెండు స్వదేశీ వ్యాక్సిన్లతో మానవాళి రక్షణకు భారత్ సంసిద్ధం

మానవజాతిని రక్షించేందుకు రెండు స్వదేశీ వ్యాక్సిన్లతో భారత్‌ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని మోడీ. 16వ ప్రవాసి భారతీయ దివస్‌ సదస్సును ఇవాళ మోడీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన టీకాల కోసం యావత్‌ ప్రపంచం ఎదురు చూస్తుండటమేగాక, అతిపెద్ద వ్యాక్సినేషన్‌ పక్రియను ఎలా నిర్వహిస్తామని ఆసక్తిగా చూస్తోందన్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం బలంగా ఉందన్నారు.  గత కొన్నిఏళ్లుగా నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్స్‌ ఇతర దేశాల్లో మరింత బలోపేతం అయ్యారని తెలిపారు. దేశంలో కరోనా ప్రభావం మొదలైన కొత్తలో భారత్‌ PPE కిట్లను, మాస్కులను, వెంటిలేటర్లను, టెస్టింగ్‌ కిట్‌లను బయటి నుంచి దిగుమతి చేసుకునేదన్నారు. అయితే ఇప్పుడు ఆ విషయంలో  స్వావలంబన సాధించిందని తెలిపారు.  భారత్‌ ఉగ్రవాదాన్ని ఎదుర్కోనేందుకు గట్టిగా నిలబడటంతో ఇప్పుడు ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని ఎదిరించే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకుందని ప్రధాని  తెలిపారు.

Latest Updates