శిశు మరణాల్లో ఇండియా టాప్

  • 2000 నుంచి సగానికి తగ్గినా ప్రప్రంచంలో నెంబర్ వన్
  • అమెరికా సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి

ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఇండియాలోనే ఐదేళ్లలోపు పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్  బ్లూమ్ బర్గ్​ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ​ సైంటిస్టులు దేశంలో రాష్ట్రా ల వారీగా శిశు మరణాల రేటుపై సర్వే చేశారు. 2000 నుంచి 2015 మధ్య ఐదేళ్ల లోపు పిల్లల మరణాలపై లెక్కలను సేకరించారు. శిశు మరణాల రేటును తగ్గించడంలో ఇండియా సఫలమైనా, ప్రపంచంలో శిశు మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో మాత్రం టాప్ లోనే ఉందని పేర్కొన్నారు. 2000వ సంవత్సరంలో 25 లక్షల మంది చిన్నారులు చనిపోగా, 2015 నాటికి అది 12 లక్షలకు తగ్గిపోయిందని, అయినప్పటికీ ప్రపంచంలో ఆసంఖ్యే చాలా ఎక్కువని అన్నారు.

ఇక, శిశు మరణాల రేటులో అస్సాం దేశంలోనే టాప్ లో ఉందని చెప్పారు. చాలా మంది చిన్నారులు నివారించదగిన ఇన్ ఫెక్షన్ జబ్బులతోనే చనిపోయారని వెల్లడించారు. ‘‘వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లను విస్తృతంగా నిర్వహించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు మెరుగైన సంరక్షణ కల్పించడం ద్వారా ఇండియా శిశుమరణాలను తగ్గించుకోవచ్చు. ప్రత్యేకించి శిశు మరణాలు ఎక్కువగా ఉన్నరాష్ట్రాల్లో ఈ చర్యలు చేపట్టాలి ” అని సైంటిస్టులు వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేయించిన ఆరోగ్య సర్వేల ద్వారా శిశు మరణాల రేటును సైంటిస్టులు అంచనా వేశారు. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి రూపొందించిన మిలీనియమ్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎండీజీ) ప్రకారం 1990ల్లో ఉన్నశిశు మరణాలను 33 శాతానికి తగ్గించేలా లక్ష్యం పెట్టారు. అంటే ఇండియాలో ఆ లక్ష్యం ప్రతి వెయ్యికి39గా ఉండాలి . కానీ, 2000 సంవత్సరం నుంచి ప్రతివెయ్యి మందికి 90.5 మంది చనిపోతున్నట్టు ప్రభుత్వ సర్వేల్లో తేలింది. 2015కు వచ్చేటప్పటికి అది 47.8కితగ్గిం ది. అయినా కూడా అది ఎండీజీ లక్ష్యానికి దగ్గరగా లేదు.

పుట్టిన నాలుగు వారాల్లోనే

2015లో మరణించిన ఐదేళ్ల లోపు  పిల్లల్లో 57.9శాతం మంది పుట్టిన నాలుగు వారాల్లోనే చనిపోయినట్టు సైంటిస్టులు గుర్తించారు. పుట్టుకతోనే వచ్చిన లోపాల వల్లే చాలా మంది చిన్నారులు చనిపోయారు. 27.5 శాతం మంది చిన్నారుల మరణానికి అదే కారణం. 15.9 శాతం మంది నిమోనియాతో చనిపోయారు. పేద రాష్ట్రాలు, శిశుమరణాల రేటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే నిమోనియాతో పిల్లలు ప్రాణాలు వదిలారు. శిశు మరణాలరేటు తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మాత్రం పుట్టుకతో వచ్చిన లోపాల వల్ల చనిపోయినట్టు సైంటిస్టులు గుర్తు చేశారు. దేశంలో శిశు మరణాల రేటు తగ్గుతున్నా పేద, ధనిక రాష్ట్రాల్లో తేడాలున్నాయన్నారు. గోవాలో ప్రతి వెయ్యి మందికి 9.7 మంది చనిపోతుంటే, అస్సాం లో 73.1 మంది చనిపోయినట్టు చెప్పారు. ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల మధ్యమరణాల రేటు నిష్పత్తి బాగా పెరిగిందన్నారు. నిమోనియా, మెదడువాపు, ఇన్ ఫ్లుయెంజాలకువ్యాక్సినేషన్లను పెంచి తే చిన్నారుల మరణాలుఇంకా తగ్గిం చొచ్చని సైంటిస్టులు సూచిస్తున్నారు.