దేశంలో కొత్త‌గా 18,653 క‌రోనా కేసులు..507 మంది మృతి

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గ‌డిచిన‌ 24 గంటల్లో దేశంలో 507 మంది మరణించగా, కొత్తగా 18,653 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా, మరణించినవారి సంఖ్య 17,400కు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 2,20,114 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు. జూన్‌ 30 వరకు 86,26,585 పరీక్షలు చేశామని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్ (‌ ICMR) ప్రకటించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

 

Latest Updates