రికార్డ్ స్థాయిలో కరోనా..గడిచిన 24గంటల్లో 8380 కేసులు నమోదు

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజు రోజుకీ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అంటే శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం 10గంటల వరకు 8320 మందికి కొత్తగా వైరస్ కేసులు నమోదైనాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 80వేలు దాటింది. ఓ వైపు  కొత్త కేసులు పెరిగే కొద్దీ.. అదే స్థాయిలో కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు కేంద్రం తెలిపింది.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని.. ఇదే సమయంలో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 180 మంది కరోనా బారినపడి మృతిచెందినట్లు కేంద్రం పేర్కొంది.

దీంతో.. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 82వేలకి చేరగా…ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 5,164 కు పెరిగింది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన చెందుతున్నారు.

ఏఏ రాష్ట్రాల్లో ఎంతమంది మరణించారంటే 

శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు మరణించిన వారి సంఖ్య 193 నాటికి పెరిగింది. వీరిలో 99 మంది మహారాష్ట్ర, 27 గుజరాత్, ఢిల్లీ నుండి 18, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి 9, పశ్చిమ బెంగాల్ నుండి 7, తమిళనాడు మరియు తెలంగాణ నుండి 6, బీహార్ 5 , ఉత్తర ప్రదేశ్ నుండి 3, పంజాబ్ నుండి 2, హర్యానా మరియు కేరళ నుండి ఒక్కొక్కరుగా మరణించారు.

Latest Updates