దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో మరోసారి అతి తక్కువ కరోనా కేసులు,మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12,584 కేసులు నమోదవ్వగా 167 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 1,04,79,179 కు చేరగా..మరణాలు1,51,327 కు చేరాయి. నిన్న 18,385 మంది కోలుకున్నారు. దీంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య1,01,11,294కు చేరింది.ఇంకా 2,16,558 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,97,056 టెస్టులు చేయగా..జనవరి 10 వరకు టెస్టుల సంఖ్య మొత్తం 18 కోట్ల 26లక్షల 52 వేల887 కు చేరాయి.

 

Latest Updates