ఒకే రోజు 12881కరోనా కేసులు..12 వేలు దాటిన మరణాలు

భారత్ లో కరోనా పంజా విసురుతోంది. ప్రతి రోజు దాదాపు 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 12881 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా 334 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,946 కు చేరగా..మృతుల సంఖ్య 12,237కు చేరింది. ఇప్పటి వరకు 1,94,325 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 1,60,384 మంది చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 116752  పాజిటివ్ కేసులు నమోదవ్వగా 5651 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 1,65,412 మందికి కరోనా టెస్టులు చేశారు.ఇక దేశ వ్యాప్తంగా జూన్ 17 వరకు 62,49,668 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

Latest Updates