కరోనా పంజా.. 24 గంటల్లో 13586 కేసులు.. 336 మరణాలు

భారత్ లో కరోనా మహమ్మారి ఉదృతి కొనసాగుతోంది. ప్రతి రోజు దాదాపు 12 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో అత్యధికంగా 13,586 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 336 మంది చనిపోయారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,80,532 కు చేరింది. మృతుల సంఖ్య 12,573 కు చేరింది. ఇప్పటి వరకు 2,07,711 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 1,63,248 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు.అత్యధికంగా మహారాష్ట్రలో 1,20,504 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 5,751 మంది చనిపోయారు.

Latest Updates