టీమిండియా భారీ స్కోరు : ఆస్ట్రేలియా టార్గెట్ 353

లండన్- కెన్నింగ్టన్ ఓవల్ : వరల్డ్ కప్ లో ఆడిన రెండో మ్యాచ్ లో కోహ్లీ గ్యాంగ్ తమ బ్యాటింగ్ సత్తా ఏంటో చాటింది. బ్యాట్స్ మెన్ అందరూ బాగా ఆడటంతో.. ఆస్ట్రేలియా ముందు 353 రన్స్ భారీ టార్గెట్ ను ఉంచగలిగింది టీమిండియా.

టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఓపెనర్ల దగ్గరనుంచి చివరి వరకు… వచ్చిన ప్రతి బ్యాట్స్ మన్ తమ ఆటతీరుతో పరుగుల పంట పండించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లు 127 రన్స్ భాగస్వామ్యం అందించారు. శిఖర్ ధావన్ 109 బాల్స్ లో 117(16 ఫోర్లు) రన్స్, రోహిత్ 70 బాల్స్ లో 57(3 ఫోర్లు, 1 సిక్స్) రన్స్ చేసి ఔటయ్యారు.

కోహ్లీ, హార్దిక్, ధోనీ మెరుపులు

కెప్టెన్ కోహ్లీతో కలిసి హార్దిక్ పాండ్యా స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 27 బాల్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 48 రన్స్ తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ధోనీ భారీ షాట్లు ఆడాడు. 14 బాల్స్ లో  3 ఫోర్లు, 1 సిక్సర్ తో 27 రన్స్ చేశాడు.

వన్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లీ …. ధావన్, హార్దిక్ పాండ్యా, ధోనీతో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కడదాకా నిలిచి ఇండియాకు భారీ స్కోరు అందించాడు. విరాట్ కోహ్లీ 77 బాల్స్ లో 82(4 ఫోర్లు, 2 సిక్సులు) రన్స్ చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. కేఎల్ రాహుల్(3 బాల్స్ లో 11 రన్స్, 1 ఫోర్, 1 సిక్స్), కేదార్ జాదవ్ నాటౌట్ గా నిలిచారు.

టీమిండియా మొత్తం 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా ముందు 353 పరుగుల టార్గెట్ పెట్టింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో స్టోనీస్ 2 వికెట్లు పడగొట్టారు. కమిన్స్, స్టార్క్, కౌల్టన్ నైల్ తలో వికెట్ తీసుకున్నారు.

Latest Updates