‘టిక్ టాక్’ పై నిఘా పెంచిన భారత్…

టిక్ టాక్ పై నిఘాను పెంచింది భారత్. ప్రపంచ దేశాలకంటే మన దేశమే టిక్ టాక్ యూజర్లపై ఓ కన్నేసి ఉంచింది.  దీంతో పాటు.. వినియోగదారుల సమాచారం ఇవ్వాలంటూ ‘టిక్ టాక్’ యాజమాన్యాన్ని 28దేశాలు కోరాయి. భారత్ కోరిన వాటిలో..  107 చట్టపరమైన, అత్యవసర విజ్ఞప్తులు ఉన్నాయి. టిక్ టాక్ యూజర్లలో అత్యధికంగా 40శాతంమంది భారతీయులు ఉన్నారు.  2019 జనవరి 1నుంచి జూన్ 30 తేదీల మధ్య 28దేశాల నుంచి వారి వారి దేశాలకు చెందిన యూజర్ల సమాచారం కావాలంటూ టిక్ టాక్ ను కోరాయి.  అయితే టిక్ టాక్ యాజమాన్యం మాట్లాడుతూ.. ఆయా దేశాల పౌరులు టిక్ టాక్ లో చేసే వీడియోలు సదరు దేశాల చట్టాలకు విరుద్దంగా ఉన్నాయా అనే విషయాన్ని తాము పరిశీలిస్తామని చెప్పారు. భారత్ నుంచి వచ్చిన విజ్ఞప్తులలో 30 శాతం వినియోగదారుల సమాచారాన్ని అందించినట్లు టిక్ టాక్ యాజమాన్యం తెలిపింది.

Latest Updates