ఇండియా మెడికల్ డివైజ్​ హబ్‌‌గా మారాలి

  • మేకిన్ ఇండియా కింద చొరవ తీసుకోవాలి
  • బడ్జెట్‌ లో నిర్ణయాలు తీసుకోవాలని విన్నపం
  • 80 శాతం డివైజెస్‌ దిగుమతి చేసుకున్నవే
  • దిగుమతులు తగ్గించుకోవాలి
  • తెలంగాణలో మెడికల్ డివైజెస్ పార్క్ వస్తోంది

వెలుగు, బిజినెస్‌‌డెస్క్ :

మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీలో ఇండియా ప్రపంచంలో టాప్ 20 మార్కెట్లలో ఒకటిగా ఉంది. 2025 నాటికి దీని మార్కెట్ సైజు 50 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ఈ ఇండస్ట్రీ వార్షికంగా 15.8 శాతం వృద్ధి సాధిస్తోంది. ఇంత భారీగా పెరుగుతోన్న ఇండియా మెడికల్ డివైజెస్‌‌ ఇండస్ట్రీలో 80 శాతం డివైజెస్ ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నవే.  ఇండియాను గ్లోబల్ మెడికల్ డివైజెస్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌‌గా మార్చాలని ఎప్పటి నుంచో అసోసియేషన్ ఆఫ్ ఇండియా మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ(ఏఐఎంఈడీ) కోరుతోంది. ఈ మేరకు సంస్కరణలు, చర్యలు బడ్జెట్‌‌లో ప్రభుత్వం తీసుకురావాలని పట్టుబడుతోంది. ఈ రంగం పెద్ద మొత్తంలో దిగుమతులపై ఆధారపడటాన్ని ఆపివేయాలని కోరుతోంది. క్వాలిటీ హెల్త్‌‌కేర్‌‌‌‌ అఫర్డబుల్‌‌గా, అందరికీ అందుబాటులోకి తేవాలని ఏఐఎంఈడీ అంటోంది. ఇండియాలో మెడికల్ డివైజెస్‌‌ల మార్కెట్‌‌ 10 శాతం నుంచి 12 శాతం ఉంది. దిగుమతులు పెరుగుతుండటంతో, ఈ మార్కెట్‌‌లో  ఇండియా డివైజెస్‌‌ షేరు 20 శాతానికి కంటే తక్కువకి పడిపోయింది.

మెడికల్ డివైజెస్‌‌లపై వేసే జీఎస్టీ కూడా.. దిగుమతులకే అనుకూలంగా ఉండటంతో, మేకిన్ ఇండియాకు ఇది ప్రమాదకరంగా మారుతోంది. దీంతో ఎంఎస్‌‌ఎంఈ రంగంలో పెద్ద మొత్తంలో ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి. బ్రిక్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. ఇండియాలో మెడికల్ డివైజెస్‌‌లపై తక్కువ మొత్తంలో దిగుమతి సుంకం ఉంది. దీంతో 80 శాతం వరకు ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యేవే. వాటిలో ఐదోవంతు అమెరికా నుంచి దిగుమతి అవుతున్నాయి. మెడికల్‌‌ డివైజెస్‌‌లనుఇండియా దిగుమతి చేసుకునే టాప్ 5 దేశాల్లో యూఎస్‌‌ఏ(21 శాతం), జర్మనీ(14 శాతం), సింగపూర్(11 శాతం), చైనా(10 శాతం), నెదర్లాండ్స్(7 శాతం) ఉన్నాయి. 80 నుంచి 90 శాతం దిగుమతులపై ఆధారపడటాన్ని ప్రభుత్వం వెంటనే ఆపివేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నాయి. దిగుమతులు ఎక్కువగా ఉండటంతో దిగుమతుల బిల్లు కూడా రూ.38,837 కోట్లకు పెరిగింది. ఫలితంగా మనం ఫారెక్స్‌‌నూ నష్టపోతున్నామని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

జీఎస్టీ తర్వాత చౌకగా మారిన డివైజెస్….

దశాబ్దం క్రితం వరకు కూడా ట్రేడర్లకు ప్రోత్సాహకాలు ఇస్తూ.. మాన్యుఫ్యాక్చరర్స్‌‌గా మార్చేవారు. కానీ ఇప్పుడు ఇండియా మెడికల్ డివైజెస్ ఇండస్ట్రీ అంటే దిగుమతులే అన్న మాదిరిగా మారింది. ప్రస్తుతం బేసిక్ ఇంపోర్ట్ టారిఫ్‌‌ 0–7.5 శాతం మధ్యలో ఉంది. ఇది 15 శాతానికి పైగా ఉండాలి. రా మెటీరియల్స్‌‌పై కన్సెషనల్(రాయితీ) డ్యూటీ  2.5 శాతంగా ఉంది. వచ్చే మూడేళ్లు ఇదే కొనసాగుతుంది. జీఎస్టీ తర్వాత దిగుమతి చేసుకునే మెడికల్ డివైజెస్‌‌లు 10 శాతానికి పైగా చౌకగా మారాయి. ఇరాన్ లాంటి దేశాలు దేశీయంగా ప్రొడక్ట్స్ ఉత్పత్తిని పెంచేందుకు, దిగుమతులపై ఆంక్షలు, డ్యూటీప్రొటెక్షన్ అమలు చేస్తున్నాయి. అవే ఇక్కడ కూడా అమలు చేయాల్సినవసరం ఉందని ఇండస్ట్రీ అంటోంది.

టారిఫ్​ ప్రొటెక్షన్‌‌ క్లాస్‌‌లు తేవాలి…

ప్రభుత్వం దేశీయంగా మొబైల్ ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించేందుకు 15 శాతం నుంచి 20 శాతం డ్యూటీలను వేస్తోంది. అదేవిధంగా ఆటోమోటివ్, సైకిల్స్, మోటార్ సైకిల్స్‌‌కు అప్లయ్ చేస్తోంది. మెడికల్ డివైజెస్‌‌లకు  కూడా అదేమాదిరి టారిఫ్​ ప్రొటెక్షన్​ క్లాజ్​‌‌లను తీసుకురావాలని ఇండస్ట్రీ కోరుతోంది. మన దేశానికి హెల్త్‌‌కేర్ సెక్యురిటీ ఎంతో అవసరమని పేర్కొంటోంది. మెడికల్ డివైజెస్‌‌ల యాక్ససరీస్‌‌పై ఉన్న దిగుమతుల బేసిక్‌‌ డ్యూటీని 2.5 శాతం నుంచి 5 శాతానికి ప్రభుత్వం పెంచాల్సి ఉందని ఇండస్ట్రీ కోరుతోంది. రెండో ఏడాది దీన్ని 7.5 శాతం పెంచాలని అంటోంది. ఎక్స్‌‌రే ఎక్విప్‌‌మెంట్‌‌కు ప్రతిపాదిస్తోన్న దశలవారీ తయారీ ప్రణాళికను, ఇతర మెడికల్ డివైజెస్‌‌లకు తీసుకురావాల్సి ఉందని అంటోంది. పేషెంట్ల సేఫ్టీని పరిగణనలోకి తీసుకొని, నీతి ఆయోగ్ ప్రతిపాదించిన పేషెంట్స్ సేఫ్టీ మెడికల్ డివైజెస్‌‌ చట్టం కింద అన్ని మెడికల్ డివైజెస్‌‌లను ఇండియా రెగ్యులేట్ చేయాలని కోరుతోంది. మెడికల్ డివైజెస్‌‌లపై ఉన్న ఎక్కువ ఎంఆర్‌‌‌‌పీ నుంచి కన్జూమర్లను కాపాడాలని పేర్కొంటోంది.

250 ఎకరాల్లో తెలంగాణలో మెడికల్ డివైజస్ పార్క్….

మెడికల్ డివైజస్‌‌ల దిగుమతులను తగ్గించడానికి తెలంగాణ తన వంతుగా మెడికల్ డివైజస్ పార్క్‌‌ను ఏర్పాటు చేస్తోంది. సుల్తాన్‌‌పూర్‌‌‌‌లో 250 ఎకరాల భూమిని దీని కోసం ప్రభుత్వం కేటాయించింది. 21 మెడికల్ ఎక్విప్‌‌మెంట్ మానుఫ్యాక్చరింగ్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీలతో ప్రభుత్వం ఎంఓయూ కూడా కుదుర్చుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ పార్క్‌‌పై రూ.500 కోట్లకు పైగా వెచ్చించనుంది. 21 కంపెనీల్లో 14 కంపెనీలకు 51.7 ఎకరాలను ల్యాండ్‌‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాట్ చేసింది. ఈ కంపెనీలు మెడికల్ డివైజస్‌‌ల పార్క్‌‌లో వచ్చే ఐదేళ్లలో రూ.425 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. 3900 మందికి ఉద్యోగావకాశాలు కూడా కల్పించనున్నాయి. మెడికల్ డివైజస్ పార్క్‌‌లో మేజర్ ఇన్వెస్టర్లుగా సైయంట్ లిమిటెడ్, సందూర్ మెడికెయిడ్స్‌‌  ప్రైవేట్ లిమిటెడ్‌‌లు వంద కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేస్తున్నాయి. హెల్త్‌‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌‌ రూ.16.2 కోట్లను ఇన్వెస్ట్ చేస్తోంది. ఇది అడ్వాన్డ్స్ సర్జరీ, గైనకాలజీ, ఈఎన్‌‌టీకి సంబంధించిన మెడికల్ ఎక్విప్‌‌మెంట్లను తయారు చేస్తుంది. మరో రూ.12.5 కోట్ల ఇన్వెస్ట్‌‌మెంట్లు మ్యాన్ మెషీన్ ఎలక్ట్రానిక్స్‌‌ నుంచి వస్తున్నాయి. లైఫ్‌‌ సైన్సస్, ఫార్మా ఇండస్ట్రీలో హైదరాబాద్‌‌ పొజిషన్‌‌ను మరింత బలోపేతం చేయడానికి ఈ ఫెసిలిటీ ఉపయోగపడుతుంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇతర దేశాలకు మెడికల్ టూరిజం డెస్టినేషన్‌‌గా హైదరాబాద్‌‌ ఉంది.

తొలి బడ్జెట్.. తాత్కాలికమే…

ఇండిపెండెంట్ ఇండియా మొదటి బడ్జెట్‌ను ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌గానే తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి ఆర్‌‌కే షణ్ముక శెట్టి 1947 నవంబర్‌‌ 26లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇండిపెండెంట్‌ ఇండియాలో బడ్జెట్‌ తీసుకొచ్చిన తొలి ఆర్థిక మంత్రిగా షణ్ముక పేరుగాంచారు. ఈ బడ్జెట్‌లో ఎకానమీ రివ్యూను మాత్రమే చేశారు. ఎలాంటి పన్ను మార్పులు, ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు.

Latest Updates