కరోనా విషయంలో ఈస్ట్రన్‌ కంట్రీస్‌ను ఆదర్శంగా తీసుకోవాల్సింది

  • రాహుల్‌ గాంధీతో రాజీవ్‌ బజాజ్‌

న్యూఢిల్లీ: కరోనాను కంట్రోల్‌ చేసే విషయంలో మన దేశం వెస్ట్రన్‌ కంట్రీస్‌ను ఫాలో అయ్యి తప్పు చేసిందని ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌ రాజివ్‌ బజాజ్‌ అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీతో గురువారం ఆయన వీడియోకాల్‌లో మాట్లాడారు. వెస్ట్రన్‌ కంట్రీస్‌తో పోలిస్తే ఈస్ట్రన్‌ కంట్రీస్‌ కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగాయని, ప్రభుత్వం ఆ దేశాల నుంచి సూచనలు తీసుకుని ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.“ ఏషియన్‌ కంట్రీ అయినప్పటికీ ఈస్ట్రన్‌ కంట్రీస్‌లో ఏం జరుగుతుందనే విషయాన్ని మనం గమనించలేకపోయాం. యూఎస్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, యూకే లాంటి దేశాలవైపే చూశాం. ఇది సరైంది కాదు. ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు తగిన వైద్య సదుపాయాలు ఉండవని మనకు తెలుసు. ” అని బజాజ్‌ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థపై లాక్‌డౌన్‌ ప్రభావం అనే అంశంపైనా ఇద్దరు చర్చించారు. వైరస్‌ వస్తే చనిపోవడమే అనే భయాన్ని ప్రజల్లో నింపారని, దీని నుంచి బయటపడటం కష్టమే అని బజాజ్‌ అన్నారు. ప్రధాని మోడీ ఏది చెప్తే ప్రజలు అది వింటారని, ఆ భయాన్ని ఆయన పోగొట్టగలరని చెప్పారు. లాక్‌డౌన్‌లో జీడీపీ బాగా పడిపోయిందని అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌ విధించిన తర్వాత రాహుల్‌ గాంధీ పులువరు ఆర్థిక వేత్తలు, వ్యాపారులతో మాట్లాడి ఆర్థిక వ్యవస్థ గురించి అనేక అంశాలు చర్చించారు. దీంట్లో భాగంగానే ఇప్పటి వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ గవర్నర్‌‌ రఘురామ్‌ రాజన్‌, నోబెల్‌ ప్రైజ్‌ విన్నర్‌‌ అభిజిత్‌ బెనర్జీ, కొంత మంది హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌తో కూడా ఆయన మాట్లాడారు.

Latest Updates