ఇండియా అదుర్స్‌..312 మెడల్స్‌ తో టాప్‌ ప్లేస్‌

  •     వరుసగా 13వ సారి అగ్రస్థానం
  •     ముగిసిన సౌత్‌‌‌‌ ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌

ఖట్మాండ్‌‌‌‌ : సౌత్‌‌‌‌ ఏషియా గేమ్స్‌‌‌‌లో ఇండియా మెడల్స్‌‌‌‌ ట్రిపుల్‌‌‌‌ సెంచరీ కొట్టింది.  మంగళవారంతో ముగిసిన ఈ పోటీలను ఓవరాల్‌‌‌‌గా 312(174 గోల్డ్‌‌‌‌, 93 సిల్వర్‌‌‌‌, 45 బ్రాంజ్‌‌‌‌) మెడల్స్‌‌‌‌తో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో ఫినిష్‌‌‌‌ చేసి సౌత్‌‌‌‌ ఏషియా గేమ్స్‌‌‌‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో 309 మెడల్స్‌‌‌‌తో (189 గోల్డ్‌‌‌‌, 90 సిల్వర్‌‌‌‌, 30 బ్రాంజ్‌‌‌‌) 2016 ఎడిషన్‌‌‌‌లో నెలకొల్పిన రికార్డును మెరుగుపర్చుకుంది. అంతేకాక 1984 నుంచి ఇప్పటిదాకా సౌత్‌‌‌‌ ఏషియా గేమ్స్‌‌‌‌ 13 సార్లు జరగ్గా అన్ని ఎడిషన్లలోను ఇండియానే టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో నిలిచింది. గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ కౌంట్‌‌‌‌లో 2016 ఎడిషన్‌‌‌‌ ఇండియా అత్యుత్తమం. 2019 ఎడిషన్‌‌‌‌లో నేపాల్‌‌‌‌ 206(51 గోల్డ్‌‌‌‌, 60 సిల్వర్‌‌‌‌, 95 బ్రాంజ్‌‌‌‌) మెడల్స్‌‌‌‌, శ్రీలంక 251(40 గోల్డ్‌‌‌‌, 83 సిల్వర్‌‌‌‌, 128 బ్రాంజ్‌‌‌‌) మెడల్స్‌‌‌‌తో ఇండియా తర్వాత వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. చివరి రోజు పోటీల్లో ఇండియా 18(15 గోల్డ్‌‌‌‌, 2 సిల్వర్‌‌‌‌, 1 బ్రాంజ్‌‌‌‌) మెడల్స్‌‌‌‌ గెలిచింది. ఇందులో బాక్సింగ్‌‌‌‌లో ఆరు గోల్డ్‌‌‌‌, ఒక సిల్వర్‌‌‌‌ వచ్చాయి. ఇండియా బాస్కెట్‌‌‌‌ బాల్‌‌‌‌ మెన్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ టీమ్స్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ గెలిచాయి. మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 101–62తో శ్రీలంకపై, విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ 127–46తో నేపాల్‌‌‌‌పై విజయం సాధించాయి. స్క్వాష్‌‌‌‌లో విమెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ సాధించగా, మెన్స్‌‌‌‌ టీమ్‌‌‌‌ సిల్వర్‌‌‌‌తో సరిపెట్టింది.

బాక్సర్ల హవా..

గేమ్స్‌‌‌‌ ఆసాంతం ఇండియా బాక్సర్ల హవా నడిచింది. మొత్తం 12 గోల్డ్‌‌‌‌, 3 సిల్వర్‌‌‌‌, 1 బ్రాంజ్‌‌‌‌తో సత్తా చాటారు. మెన్స్‌‌‌‌ కేటగిరీలో వికాశ్‌‌‌‌ క్రిషన్‌‌‌‌(69 కేజీ), స్పర్శ్‌‌‌‌ కుమార్‌‌‌‌(52 కేజీ), నరేందర్‌‌‌‌(91 ప్లస్‌‌‌‌ కేజీ), విమెన్స్‌‌‌‌లో పింకీరాణి(51 కేజీ), సోనియా లాథర్‌‌‌‌(57 కేజీ), మంజు బంబొరియా(64 కేజీ) గోల్డ్‌‌‌‌ మెడల్స్‌‌‌‌ గెలిచారు. వారిందర్‌‌‌‌సింగ్‌‌‌‌(60 కేజీ) ఫైనల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో నేపాల్‌‌‌‌కు చెందిన సిల్‌‌‌‌ షాహి చేతిలో ఓడి సిల్వర్‌‌‌‌తో సరిపెట్టుకున్నాడు. 2018 ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌ మెడల్‌‌‌‌ విజేత వికాశ్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ బౌట్‌‌‌‌లో 5–0తో పాకిస్థాన్‌‌‌‌కు చెందిన గుల్‌‌‌‌ జైబ్‌‌‌‌పై తిరుగులేని విజయం సాధించాడు. నరేందర్‌‌‌‌ 5–0తో అశిశ్‌‌‌‌ దువాది(నేపాల్‌‌‌‌)పై గెలువగా, స్పర్శ్‌‌‌‌ 4–1తో సయ్యద్‌‌‌‌ ముహ్మద్‌‌‌‌ అసిఫ్‌‌‌‌(పాకిస్థాన్‌‌‌‌)పై పోరాడి గెలిచాడు. విమెన్‌‌‌‌ బాక్సర్లు పింకీరాణి, మంజు ఇద్దరూ వరుసగా 3–2తో నేపాల్‌‌‌‌కు చెందిన రాయ్‌‌‌‌ మలా, పూనమ్‌‌‌‌ రావల్‌‌‌‌పై పోరాడి గెలిచారు.

Latest Updates