మా దేశం… మా కాశ్మీర్​

  • కాశ్మీర్ అంశంలో జోక్యాన్ని సహించబోం
  • యూఎన్ హెచ్చార్సీలో పాక్ కు ఇండియా వార్నింగ్
  • పాక్ ప్రతినిధి తీరుపై విదేశాంగ కార్యదర్శి ఫైర్

జెనీవా: జమ్మూ కాశ్మీర్​స్పెషల్​ స్టేటస్​ ఎత్తివేత నిర్ణయం ఇండియా సార్వభౌమాధికారానికి సంబంధించిందని, ఇందులో ఇతర దేశాల జోక్యాన్ని ఎట్టిపరిస్థితిలోనూ సహించబోమని విదేశాంగ శాఖ సెక్రెటరీ(ఈస్ట్) విజయ్​ థాకూర్​సింగ్ ​తేల్చిచెప్పారు. జెనీవాలో మంగళవారం జరిగిన 42వ యూఎన్​ హెచ్చార్సీ సమావేశంలో మాట్లాడుతూ.. కాశ్మీర్​ అంశంపై పాకిస్తాన్​ ఆరోపణలను తిప్పికొట్టారు. కాశ్మీర్​లో అంతా రాజ్యాంగబద్ధంగానే జరుగుతోందని స్పష్టంచేశారు. పార్లమెంట్​లో చర్చించిన తర్వాత, ఉభయ సభల ఆమోదంతోనే ఆర్టికల్​ను రద్దు చేశామన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు సంతోషంతో స్వాగతించారని చెప్పారు. జమ్మూ, కాశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుందని వివరించారు. ఒక్కొక్కటిగా ఆంక్షలను ఎత్తివేస్తోందని తెలిపారు. కాశ్మీర్​లో మానవ హక్కుల ఉల్లంఘనపై అంతర్జాతీయ విచారణ జరిపించాలన్న పాక్​ డిమాండ్​ను తీవ్రంగా తప్పుబట్టారు.

హ్యూమన్​రైట్స్​వేదికను రాజకీయ అజెండాగా మార్చే ప్రయత్నాలను ఖండించాలని సింగ్​ అన్నారు. టెర్రరిజానికి ఆశ్రయమిచ్చి ప్రోత్సహించడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. టెర్రరిజంపై, దానిని ప్రోత్సహించే దేశాలకు వ్యతిరేకంగా ఇండియా సాగిస్తున్న పోరాటంలో కలిసి నడవాలంటూ ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అస్సాంలో నేషనల్​ రిజిస్టర్​ ఆఫ్​ సిటిజెన్స్(ఎన్నార్సీ) వ్యవహారం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పూర్తిగా చట్టబద్ధంగా, పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. జాతీయ సంస్థలు బలోపేతంగా ఉన్నపుడే దేశంలో మానవ హక్కుల పరిరక్షణ సాధ్యమని ఇండియా నమ్ముతుందని విజయ్​ థాకూర్​ సింగ్​ హెచ్చార్సీలో పేర్కొన్నారు.

దొంగే దొంగని అరిచినట్లుంది

టెర్రరిస్టు లీడర్లకు ఆశ్రయమిస్తూ, నిధులిస్తూ టెర్రరిజాన్ని ప్రోత్సహించే దేశం మానవ హక్కుల గురించి మాట్లాడిన​ తీరు చూస్తుంటే.. దొంగే దొంగని అరిచినట్లుందని విజయ్​ థాకూర్​ సింగ్​ అన్నారు. ప్రపంచ దేశాలన్నింటికీ పాక్ తీరు బాగా తెలుసన్నారు. స్పెషల్ స్టేటస్​రద్దు నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా, టెర్రర్​ దాడులకు అవకాశమివ్వకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగానే కాశ్మీర్​లో నేతలను హౌజ్​ అరెస్ట్​ చేశామని ఆమె చెప్పారు. కాశ్మీర్​పై ఆరోపణలు చేస్తున్న పాక్.. తన అధీనంలోని పీవోకే లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకోవాలని సింగ్​ తిప్పికొట్టారు.

India slams Pakistan at UNHRC for its false narrative on ‘atrocities’ in J&K

Latest Updates