శ్రీకాంత్ డెన్మార్క్ వెళ్లేందుకు అనుమతి

న్యూఢిల్లీ: డెన్మార్క్​ ఓపెన్ బరిలో నిలిచిన ఇండియా స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కు స్పోర్స్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్ ) గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీకాంత్ రిక్వెస్ట్‌ ను మన్నించిన సాయ్ .. తెలుగు షట్లర్ తన పర్సనల్ కోచ్, ఫిజియోథెరపిస్ట్​తో కలిసి డెన్మార్క్​ వెళ్లేందుకు అనుమతిచ్చింది. శ్రీకాంత్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ లో ఉండడం వల్లే సాయ్ సానుకూలంగా స్పందించింది. దీంతో శ్రీకాంత్ తన టీమ్ తో కలిసి కాస్త ముందుగానే డెన్మా ర్క్​ వెళ్లనున్నాడు. అయితే, శ్రీకాంత్ వెంట వెళ్లే సిబ్బంది పేర్లను సాయ్ ప్రకటించలేదు. కాగా, శ్రీకాంత్ తోపాటు అతని సపోర్ట్​ స్టాఫ్ కు అయ్యే కరోనా టెస్ట్​ల ఖర్చును కూడా సాయ్ భరించనుంది. అక్టోబర్ 13 నుంచి ఒడెన్స్ వేదికగా డెన్మార్క్​ ఓపెన్ జరగనుంది.

Latest Updates