సిరీస్ మనదే..!: సూపర్ ఓవర్ లో కివీస్ పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ

హామిల్టన్‌ : న్యూజిలాండ్  తో జరిగిన మూడో  టీ20లో భారత్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. టైగా ముగిసిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లోనూ లాస్ట్ బాల్ వరకి ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.

మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్…  17 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్ లో కెప్టెన్ విలియమ్సన్ ఫోరు, సిక్సరుతో స్కోరును పరుగులు పెట్టించాడు. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లాస్ట్ వరకు ఉత్కంఠభరితంగా టార్గెట్ ను  ఛేజ్ చేసింది. లోకేశ్ , రోహిత్ జోడీ…. అభిమానులకు అద్భుత విజయాన్ని అందించారు. 2 బాల్స్ 10 రన్స్ అవసరంకాగా.. హిట్ మ్యాన్ రోహిత్ 2 సిక్సులు కొట్టి భారత్ కు విజయం అందించాడు. దీంతో 5 టీ20ల సిరీస్..  మరో రెండు మ్యాచ్ లు మిగులుండగానే సిరీస్ ను గెలుచుకుంది భారత్.

see also : లాస్ట్ బాల్ వరకు ఉత్కంఠ

Latest Updates