చైనాకు మరో షాకిచ్చిన ఇండియా

  • హైవే ప్రాజెక్ట్‌లలో చైనీస్ కంపెనీలు బ్యాన్
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
  • జాయింట్ వెంచర్లలో కూడా అనుమతించం
  • లోకల్ కంపెనీల కోసం రూల్స్ మార్పు
  • చైనీస్ కంపెనీలపై ఇండియా సీరియస్‌‌ యాక్షన్‌‌

న్యూఢిల్లీ: డ్రాగ‌న్‌కు ఇండియా మ‌రో షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే చైనీస్ యాప్ ల‌పై నిషేధం విధించిన ఇండియా.. హైవే ప్రాజెక్ట్‌ లలో కూడా చైనీస్ కంపెనీలను బ్యాన్ చేసింది. హైవే ప్రాజెక్ట్‌ లలో చైనీస్ కంపెనీలను ఇక ఇండియా అనుమతించబోదని, జాయింట్ వెంచర్ల ద్వారా కూడా చైనీస్ కంపెనీలు ఇండియన్ ప్రాజెక్ట్‌ లలో పాలుపంచుకోకుం డా నిషేధం విధిస్తున్నట్టు కేం ద్ర రోడ్డు ట్రాన్స్‌ పోర్ట్, హైవేస్, ఎంఎస్‌‌ఎంఈల మంత్రి నితిన్ గడ్కరీ వె ల్లడిం చారు. చైనాతో సరిహద్దు సమస్య నెలకొన్న క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నా రు. కుటీర, చి న్న, మధ్య తరహా సంస్థలు(ఎంఎస్‌‌ఎంఈ) లాంటి పలు రంగాల్లో కూడా చైనీస్ ఇన్వెస్టర్లను ఇక ప్రభుత్వం అనుమతించబోదని గడ్కరీ తెలిపారు. లడఖ్‌ లో ఇండియా–చైనాల మధ్య నెలకొన్న వివాదంలో, ఇండియన్ సైనికులు 20 మంది వరకు వీరమరణం పొందా రు. ఈ వివాదంతో దేశవ్యాప్తంగా బాయ్‌ కాట్ చైనా ఉద్యమం నెలకొం ది. చైనీస్ యాప్స్‌ ను, వస్తువులను బా య్‌ కాట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి . ఇప్పటికే చైనాకు చెందిన 59 యాప్స్‌ పై ఇండియా నిషేధం విధించింది. ఈ యాప్స్ వల్ల దేశ భద్రత ప్రమాదంలో పడుతుం దని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాక చైనీస్ కంపెనీల విషయంలో కూడా ఇండియా కఠినమైన నిర్ణయాలు తీసుకుం టోంది. రోడ్డు కన్‌ స్ట్రక్షన్‌ లో చైనా పార్టనర్లు ఉన్న జాయింట్ వెంచర్లకు కూడా పర్మిషన్ ఇవ్వబోమని గడ్కరీ పీటీఐకి ఇచ్చి న ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ విషయంలో తాము దృఢమైన వైఖరిని అవలంబించనున్నామని, ఒకవేళ చైనా కంపెనీలు జాయింట్ వెంచర్ల రూ పంలో ఇండియాలోకి రావాలనుకుంటే, తాము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించమని స్పష్టం చేశారు. చైనా కంపెనీలను బ్యాన్ చేస్తూ త్వరలోనే ఒక పాలసీని తీసుకురానున్నా మని కేం ద్ర మంత్రి తెలిపారు. ఇండియన్ కంపెనీలకు నిబంధనలను సడలిస్తామని చెప్పా రు. హైవే ప్రాజెక్ట్‌ లలో ఇండియన్ కంపెనీలు ఎక్కువగా భాగం పంచుకునేలా అర్హత నిబంధనలలో మార్పు లు చేస్తామని చెప్పా రు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్‌ లలో మాత్రమే చైనీస్ పార్టనర్లు ఉన్నా రు. ఈ కొత్త నిర్ణయం ప్రస్తుత, భవిష్యత్ టెండర్లకు అమలు చేయనున్నా మని మంత్రి తెలిపారు. ప్రస్తుత, భవిష్యత్ బి డ్స్‌ పై స్పందించి న మంత్రి.. ఒకవేళ ప్రస్తుత ప్రాజెక్ట్‌ లలో చైనీస్ జాయింట్ వెంచర్లుగా ఉంటే..మరోమారు బిడ్డింగ్ నిర్వహిస్తామని చెప్పా రు.

లోకల్ ప్రొడక్షన్‌‌ను పెంచుతాం…

ఎంఎస్‌‌ఎంఈ సెక్టార్‌‌‌‌పై స్పందించి న గడ్కరీ, లోకల్ ప్రొడక్షన్ కెపాసిటీని పెం చనున్నా మని తెలిపారు. ఇదే సమయంలో ఎంఎస్‌‌ఎంఈ రంగంలో ఫారిన్ ఇన్వెస్ట్‌ మెంట్‌‌ను ప్రమోట్ చేయనున్నా మన్నారు. ఫారిన్ ఇన్వెస్ట్‌ మెంట్ ప్రోత్సహిం చే నిర్ణయం తీసుకున్నా.. చైనీస్ ఇన్వెస్టర్లను అనుమతించమని క్లా రిటీ ఇచ్చారు. ఎంఎస్‌‌ఎంఈ రంగంలో టెక్నా లజీ, రీసెర్చ్, కన్సల్టెన్సీ , ఇతర వర్క్‌‌ల విషయంలో అప్‌ గ్రేడ్ అవసరమైతే ఫారిన్ ఇన్వెస్ట్‌ మెంట్‌‌ను ప్రోత్సహిం చనున్నా మని, కానీ చైనాను మాత్రం ఎంటర్‌‌ చేయమని చెప్పా రు. ఎంఎస్‌‌ఎంఈలకు సా యం చేసేందు కు పలు సంస్కరణలను తీసుకురానున్నా మని, ఆత్మనిర్భర్ భారత్‌‌ను తయారు చేసేందు కు వ్యాపారాల కోసం కీలక నిర్ణయాలు తీసుకోనున్నామని చెప్పా రు. ఇండియన్ బి జినెస్‌‌లు మరింత ఎదిగేందు కు, నైపుణ్యాలు పెం చుకునేందు కు చాలా బలం ఉందని, స్వతహాగా ఎదిగే సత్తా భారత్‌‌కు ఉందని గడ్కరీ చెప్పా రు. ప్రధాని మోడీ నాయకత్వం లో, కేంద్ర ప్రభుత్వం పలు రికార్డ్ బ్రేకిం గ్ సంస్కరణలను తేనుం దని, ఇవి ఇండియన్ వ్యాపారాలకు, ఎంఎస్‌‌ఎంఈలకు సా యపడతాయని తెలిపారు.

విశాఖ, చెన్నై పోర్ట్‌ లలో చైనా కన్‌‌సైన్‌‌మెంట్లపై స్క్రూటినీ…

ఇండియన్ పోర్ట్‌ ల వద్ద చైనా కన్‌ సైన్‌ మెంట్లు ఆపివేయడంపై స్పందించి న మంత్రి.. ఏకపక్షంగా గూడ్స్‌ ను ఆపడం లేదని తెలిపారు. చైనా నుంచి వచ్చే కన్‌ సైన్‌ మెంట్లకు చెన ్నై, విశాఖ పోర్ట్‌ ల వద్ద కస్టమ్స్ అథారిటీలు అదనపు స్క్రూటినీ చేపడుతున్నారు. సరిహద్దు దేశం నుంచి వచ్చే కన్‌ సైన్‌ మెంట్లపై ఫిజికల్ ఇన్‌ స్పెక్షన్‌ ను కూడా కస్టమ్స్ అధికారులు నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి నిర్ణయమని, చైనా నుంచి వచ్చే దిగుమతులు ఇక తగ్గనున్నాయని చెప్పా రు. సొంతంగా ఎదిగేలా దేశం ఇంక పయనిం చనుం దని తెలిపారు. అయితే పోర్ట్‌ ల వద్ద ఆలస్యమవుతోన్న అగ్రికల్చర్ ఎక్విప్‌ మెంట్ కన్‌ సైన్‌ మెంట్ల దిగుమతులపై మంత్రి స్పందిం చారు. రైతులు, ట్రేడ్‌‌ అసోసియేషన్ల కోరిక మేరకు, త్వరగా రైతులకు సంబంధించిన కన్‌ సైన్‌ మెంట్లకు క్లి యరెన్స్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్‌‌కు లేఖ రాసినట్టు చెప్పా రు.

క‌న్‌స్ట్ర‌క్ష‌న్ రూల్స్‌లో మార్పు

‘ పెద్ద ప్రాజెక్ట్‌ లలో మన దేశ కంపెనీలు బిడ్డిం గ్ క్వాలిఫై అయ్యేలా నిబంధనలను సడలించాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ విషయంపై హైవేస్ సెక్రటరీ(గిరిధర్ అరామనే), ఎన్‌ హెచ్‌ ఏఐ ఛైర్మన్(ఎస్‌‌ఎస్ సంధు)కు ఆదేశాలు జారీ చేశాం . టెక్ని కల్, ఫైనాన్సియల్ రూ ల్స్​ సడలిం చేలా వీరితో మీటింగ్ నిర్వహించనున్నాం. దీంతో మన దేశ కంపెనీలు త్వరగా ప్రాజెక్ట్‌ లకు క్వాలిఫై అవుతాయి’ అని గడ్కరీ తెలిపారు. చిన్న ప్రాజెక్ట్‌ లకు క్వాలిఫై అయిన కాంట్రాక్టర్, పెద్ద ప్రాజెక్ట్‌ లకు కూడా క్వాలిఫై అయ్యేలా రూ ల్స్​ ఉంటాయని ఆయన చెప్పా రు. కన్‌ స్ట్రక్షన్ నిబంధనలు అంత సరిగా లేవని, వాటిని మార్చాల్సి ఉందన్నా రు. ఈ నిబంధనల్లో మార్పు లు చేసి, ఇండియన్ కంపెనీలను ప్రోత్సహిం చనున్నామని వె ల్లడిం చారు. గడ్కరీ చెప్పి న ప్రకారం, ప్రాజెక్ట్‌ లను పొందేందు కు ఇండియన్ కంపెనీలు ఫారిన్ పార్టనర్లతో జత కట్టాల్సి నవసరం లేకుం డా.. క్వాలిఫికేషన్ రూల్స్​ను రేషనలైజ్ చేయనున్నారు.

Latest Updates