స్విస్​ఖాతాలు ఇక ఓపెన్

న్యూఢిల్లీ: స్విస్​ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న భారతీయ కుబేరుల వివరాలు ఆదివారం బయటపడనున్నాయి. తమ ఖాతాదారుల వివరాలను స్విస్​బ్యాంకులు ఇప్పటి వరకూ అత్యంత గోప్యంగా ఉంచాయి. ఇండియన్​గవర్నమెంట్​కోరినా బయటపెట్టలేదు.. తాజాగా సమాచార మార్పిడికి సంబంధించి ఇండియా, స్విట్జర్లాండ్​మధ్య ఒప్పందం కుదిరింది. ఆదివారం నుంచి అమలులోకి రానున్న ఈ ఒప్పందంతో నల్ల కుబేరుల వివరాలన్నీ వెలుగులోకి వస్తాయని సీబీడీటీ అధికారులు చెబుతున్నారు. నల్లధనంపై కేంద్రం జరుపుతున్న పోరులో ఇదో కీలకమైన అడుగని చెప్పారు. 2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల వివరాలను అందుకోనున్నామని, ఆ ఏడాదిలో ఖాతాలు మూసేసిన వారి వివరాలు కూడా అందులో ఉంటాయని వివరించారు.

Latest Updates