టిక్‌టాక్ స‌హా 59 చైనా యాప్‌ల‌పై భారత్ శాశ్వత నిషేధం

దేశ స‌మ‌గ్ర‌త‌, సార్వ‌భౌమాధికారం, రక్ష‌ణ, భ‌ద్ర‌త, ప్ర‌యోజ‌నాల దృష్ట్యా గ‌తేడాది జూన్‌లో టిక్‌టాక్ స‌హా చైనాకు చెందిన 59 యాప్‌ల‌పై భార‌త ప్ర‌భుత్వం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రస్తుతం తాజాగా ఆ యాప్‌ల‌పై కేంద్రం శాశ్వతంగా నిషేధం విదించ‌నుంది. దీనికి సంబంధించి  సంబంధిత యాప్‌ల‌ను శాశ్వ‌తంగా నిషేదించ‌నున్న‌ట్లు తెలుపుతూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. భార‌తీయుల డేటా సేక‌రించి ఈ యాప్‌లు దుర్వినియోగం చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌ల‌తో గతేడాది కేంద్రం వీటిపై తాత్కాలికంగా బాన్ చేసింది. త‌ర్వాత  ఆ సంస్థ‌ల నుంచి వివ‌ర‌ణ కోరింది. వాళ్లు ఇచ్చిన వివ‌ర‌ణ‌తో సంతృప్తి చెంద‌ని ప్ర‌భుత్వం.. వాటిని శాశ్వ‌తంగా నిషేధించాల‌ని నిర్ణ‌యించినట్లు స‌మాచారం. ఇప్ప‌టికే 200కుపైగా చైనీస్ యాప్స్‌పై ప్ర‌భుత్వం బాన్ చేసింది. అందులో పాపుల‌ర్ గేమ్ ప‌బ్‌జీ కూడా ఒక‌టి.

Latest Updates