బాక్సింగ్ డే టెస్టుపై కరోనా ఎఫెక్ట్?

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది చివర్లో ఇండియా–కంగారూ సిరీస్‌ మధ్య జరగాల్సిన నాలుగు టెస్టుల సిరీస్‌పై కరోనా ఎఫెక్ట్ పడేలా ఉంది. ఈ సిరీస్ డిసెంబర్ 3న మొదలవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా తొలి టెస్ట్ బ్రిస్బేన్‌లో జరగనుండగా.. మిగిలిన మ్యాచులకు అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే విక్టోరియా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా డిసెంబర్‌‌ 26న మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్ట్‌ జరగడం అనుమానంగా మారింది. విక్టోరియాలో సోమవారం కొత్తగా 75 కేసులు నమోదవడంతో క్వీన్స్‌లాండ్ అఫీషియల్స్ ఆసీస్‌లోని మిగతా రాష్ట్రాలతో బార్డర్స్‌ను మూసేశారు. పరిస్థితులు మరింత తీవ్రమైతే నాలుగో టెస్టును విక్టోరియా నుంచి మరో వేదికకు మార్చడంపై క్రికెట్ ఆస్ట్రేలియా సమాలోచనలు చేసే అవకాశం ఉంది.

Latest Updates