ఫస్ట్ టీ20: ఆసిస్ పై భారత్ అదిరే విక్టరీ

3 టీ20ల్లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ టీ20 మ్యాచ్ లో భారత్ గ్రేట్ విక్టరీ సాధించింది. 11 రన్స్ తేడాతో గెలిచింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 రన్స్ చేసింది. ప్రారంభంలోనే ఓపెనర్ ధావన్ ఔట్ కావడంతో రన్ రేట్ తగ్గుతూ వచ్చింది. భారత ప్లేయర్లలో కేఎల్ రాహుల్, జడేజా అద్భుత ఇన్నింగ్స్ తో చెలరేగడంతో ఇండియా గౌరవ ప్రధమైన స్కోర్ చేసింది.

ఆ తర్వాత లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 150 రన్స్ చేసి ఓటమి పాలైంది. ప్రారంభంలో ఆస్ట్రేలియా ఓపెనర్లు బౌండరీలతో చెలరేగినప్పటికీ చాహల్ బౌలింగ్ లో ఫించ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత స్మిత్, మ్యాక్స్ వెల్ ఔట్ కావడంతో కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది.  దీంతో 1-0 లీడ్ లో భారత్ ఉంది. రెండో టీ20 6వ తేదీన జరగనుంది.

Latest Updates