వార్న్‌ x సచిన్‌.. బెస్ట్‌ వార్

న్యూఢిల్లీ: ఇండియా బ్యాటింగ్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ఆస్ట్రే లియా స్పిన్ గ్రేట్ షేన్ వార్న్‌‌ రైవలరీ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకునేది. గ్రౌండ్‌లో పైచేయి సాధిం చేందుకు ఈ ఇద్ద రి మధ్య సాగే బ్యాటిల్ మ్యాచ్‌ ఫలితాలకంటే ఆసక్తిగా ఉండేది. అలా చెన్నై చిదంబరం స్టేడియంలో 1998లో ఇండియా, ఆస్ట్రే లియా టెస్టులో ఈ ఇద్ద రి మధ్య జరిగిన ఆసక్తికర సమరం తాను చూసిన బెస్ట్‌ బ్యాటిల్ అని హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. నాటి సంఘటనలను వెల్లడిం చాడు. ‘ఆ మ్యాచ్‌ కోసం సచిన్ బాగా ప్రిపేరయ్యాడు. కానీ, ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 4 రన్స్‌కే ఔటయ్యాడు. ఓ బౌండ్రీ కొట్టిన తర్వాత మిడాన్ మీదుగా భారీ షాట్‌ ‌ఆడే ప్రయత్నం చేశాడు. కానీ, వార్న్ టర్నింగ్ బాల్ కు  అతను మార్క్ టేలర్‌కు చిక్కాడు. ఆ బాధలో సచిన్ ఫిజియో రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దాదాపు గంట తర్వాత బయటికి వచ్చాడు. అప్పుడు అతని కళ్లు ఎర్రగా మారాయి. అలా ఔటైనందుకు అతను చాలా ఎమోషనల్ అయ్యాడు. కానీ, సెకండ్‌‌ఇన్నింగ్స్‌లో మాత్రం వార్న్‌‌బౌలింగ్‌లో సచిన్‌ చెలరేగిపోయాడు. లెగ్ స్టంప్‌ మీదుగా రఫ్ ఏరియాల్లో బాల్స్‌ వేసిన వార్న్‌‌కు చుక్కలు చూపించాడు. వార్న్‌‌లెంగ్త్ బాల్స్ వేస్తే సచిన్.. మిడాన్, మిడాఫ్‌ మీదుగా షాట్లు బాదేస్తూ సెంచరీ కొట్టేశాడు. సచిన్‌, వార్న్‌‌ మధ్య నేను చూసిన  బెస్ట్ బ్యాటిల్ ఇదే అని వీవీఎస్‌‌ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ఇండియా ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 257 రన్స్‌కే ఆలౌటవగా.. ఆసీస్‌‌ 328 రన్స్‌ చేసింది. అయితే, సెకండ్‌‌ఇన్నింగ్స్‌లో సచిన్‌(155 నాటౌట్‌‌) భారీ సెంచరీతో ఇండియా 418/4 వద్ద డిక్లేర్‌క్లే చేసింది. ఆపై ఆసీస్‌‌ను 168 రన్స్‌కే ఆలౌట్‌‌చేసిన టీమిండియా 179 పరుగుల తేడాతో గ్రాండ్‌‌ విక్టరీ సాధించింది.

Latest Updates