భారత్ Vs ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్: ఆస్ట్రేలియా టార్గెట్ 256

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో మొదటగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బ్యాట్స్ మెన్లు శిఖర్ ధావన్ 74, కేఎల్ రాహుల్ 47, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 25 పోరాడినా భారీ స్కోర్ చేయలేకపోయారు. ఇప్పటివరకూ 5 వికెట్లను కోల్పోయింది ఇండియా. శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  156 పరుగుల వద్ద భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 16  పరుగులు చేసి జంపా బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకు ముందు 140 పరుగుల వద్ద శిఖర్ ధావన్ 74 పరుగులు చేసి పాట్ కమిన్స్  బౌలింగ్ లో అగర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ 47 పరుగులు చేసి ఆస్టన్ అగర్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 10 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, షమి రెండంకెల స్కోరు మాత్రమే చేసి 255 పరుగులకి స్కోరు నమోదు చేశారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3, ప్యాట్ కమిన్స్ 2, కేన్ రిచర్డ్సన్ 2 వికెట్లు తీశారు.ఆస్ట్రేలియా జట్టు విజయలక్ష్యాన్ని చేరుకోవాలంటే 256 పరుగులు చేయాల్సి ఉంది.

India vs Australia, 1st ODI: India all out at 255 in 49.1 overs.

Latest Updates