ప్రతీకారం తీర్చుకున్న భారత్ : ఆస్ట్రేలియాపై బిగ్ విక్టరీ

రాజ్ కోట్: 3వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన సెకండ్ వన్డేలో టీమిండియా విక్టరీ సాధించింది. 36 రన్స్ తేడాతే గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 రన్స్ చేసింది. టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఫస్ట్ వన్డేలో ఘోరంగా ఓడిన భారత ప్లేయర్లు రెచ్చి పోయారు. అటు బౌలింగ్ లోనూ అదరగొట్టిన టీమిండియా ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.

341 టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ప్రారంభంలోనే కీలక వార్నర్ వికెట్ ను కోల్పోయింది. ఆ తర్వాత కాసేపు మెరుపులు మెరిపించినప్పటికీ .. మనోళ్ల స్పన్ బౌలింగ్ కి టపటపా వికెట్లు పడ్డాయి. 49.1 ఓవర్లకు 304 రన్స్ కి ఆల్ ఔట్ అయ్యింది ఆస్ట్రేలియా.  దీంతో 3 వన్డేల సిరీస్ ను  1-1తో సమంగా ఉంది. ఈ నెల 19న బెంగళూరులో మూడో వన్డే జరగనుంది.

భారత బౌలర్లలీ షమీ(3), సైనీ(2), జడేజా(2), కుల్దీప్ యాదవ్(2), బుమ్రా(1) వికెట్లు తీశారు.

ఆస్ట్రేలియా ప్లేయర్లలో స్మిత్(98), లబూషేన్‌(48), ఫించ్(33) తప్ప మిగతాప్లేయర్లు తక్కువ రన్స్ కే ఔట్ అయ్యారు.

See Also: రోహిత్ మరో వరల్డ్ రికార్డ్..

Latest Updates