రాజ్ కోట్ లో రాణించిన భారత్ : ఆస్ట్రేలియాకు బిగ్ టార్గెట్

రాజ్ కోట్: మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెకండ్ వన్డేలో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 రన్స్ చేసింది. ఓపెనర్లు శిఖర్, దవన్ రోహిత్ శర్మలు భారత్ కు మంచి ఓపెనింగ్ ఇచ్చారు. వీరిద్దరి జోడి 81 పరుగుల పాట్నర్ షిప్ చేసింది. ఆతరువాత కెప్టెన్ కోహ్లీ, శిఖర్ ధవన్ లు కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

వీరిద్దరు కలిసి 103 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ధవన్, కోహ్లీ ఔటయ్యాక లోకేశ్ రాహుల్ ఇన్నింగ్స్ ను నడిపించాడు. 52 బాల్స్ లోనే 80 పరుగులు చేసి భారత్ కు భారీ స్కోరందించాడు. చివర్లో కేఎల్ రాహుల్ దంచి కొట్టడంతో ఆస్ట్రేలియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్ ను ఉంచింది కోహ్లీ సేన. ప్రారంభంలో భారీ స్కోర్ దిశగా ఉన్నప్పటికీ ఆసిస్ స్పిన్నర్ ఆడమ్ జంపా వరుస వికెట్లతో టీమిండియాను కట్టడి చేశాడు.

భారత ప్లేయర్లలో.. రోహిత్ శర్మ(42), శిఖర్ ధావన్(96), విరాట్ కోహ్లీ(78), శ్రేయాస్ అయ్యర్(7), మనీష్ పాండే(2), కేఎల్ రాహుల్(80), రవీంద్ర జడేజా(21), షమీ(1) రన్స్ చేశారు

ఆస్ట్రేలియా బౌలర్లలో..ఆడమ్ జంపా(3),రిచర్డ్ సన్(2) వికెట్లు తీశారు.

 

Latest Updates