కుప్పకూలిన టాప్ ఆర్డర్.. 183 పరుగులకి 5 వికెట్లు

india vs australia: India lose 5 wickets in quick succession

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఇప్పటివరకూ 5 వికెట్లను కోల్పోయింది ఇండియా. శ్రేయాస్ అయ్యర్ 4 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు.  156 పరుగుల వద్ద భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ 16  పరుగులు చేసి జంపా బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకు ముందు 140 పరుగుల వద్ద శిఖర్ ధావన్ 74 పరుగులు చేసి పాట్ కమిన్స్  బౌలింగ్ లో అగర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 134 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ 47 పరుగులు చేసి ఆస్టన్ అగర్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్ రోహిత్ శర్మ 10 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో వార్నర్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం రిషబ్ పంత్ (11), రవీంద్ర జడేజా(13) ఆడుతున్నారు.  37 ఓవర్లలో ఇప్పటి వరకూ నమోదైన భారత్ స్కోరు 183/5.

india vs australia: India lose 5 wickets in quick succession

Latest Updates