పందెం కోళ్ల సవాల్​!..ఇవాళ ఇండియా ఆస్ట్రేలియా తొలి వన్డే

ముంబై: ఓపెనింగ్‌‌ సమస్య తీరింది.. ఇద్దరు మినహా  ఫుల్‌‌స్ట్రెంత్‌‌ టీమ్‌‌ కూడా అందుబాటులోకి వచ్చింది.. ఇక మిగిలింది.. ఎవరు ఏ స్థానంలో ఆడాలి? ఈ బ్యాటింగ్‌‌ ప్లేస్‌‌మెంట్స్‌‌ను తేల్చేందుకు టీమిండియా ఇప్పుడు ప్రయోగాల బాట పట్టబోతున్నది. అవసరమైతే బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో భారీ మార్పులకు కూడా శ్రీకారం చుట్టాలని భావిస్తోన్నది. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌లో దీనిపై కసరత్తులు చేయాలని కెప్టెన్‌‌ కింగ్‌‌ కోహ్లీ టార్గెట్‌‌గా పెట్టుకున్నాడు. టీమ్‌‌కు మంచి జరుగుతుందంటే లైనప్‌‌లో తన స్థానాన్ని మార్చుకోవడానికి సిద్ధమేనని సంకేతాలిచ్చాడు. మరోవైపు వరల్డ్‌‌ కప్‌‌ సెమీస్‌‌ ఓటమి తర్వాత ఆసీస్‌‌ వన్డే మ్యాచ్‌‌లు ఆడలేదు. దీంతో కొత్తవారితో సరికొత్తగా రూపొందిన టీమ్‌‌ను.. బలమైన ఇండియాపై పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అలాగే ఆ మెగా ఈవెంట్‌‌లో టీమిండియా చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని కూడా ప్లాన్స్‌‌ వేస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌ని అంచనా వేయడం కష్టంగా మారింది.

ముగ్గురికి చాన్స్‌‌

ఈ మ్యాచ్‌‌ కోసం అందుబాటులో ఉన్న ముగ్గురు ఓపెనర్లు రోహిత్‌‌, ధవన్‌‌, రాహుల్‌‌ను ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో అకామిడేట్‌‌ చేస్తున్నట్లు విరాట్‌‌ ఇప్పటికే స్పష్టం చేశాడు. అయితే ప్రస్తుత ఫామ్‌‌ ప్రకారం రోహిత్‌‌కు జతగా రాహుల్‌‌కే ఎక్కువ చాన్స్‌‌ ఉంది. కానీ వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌లో ఆసీస్‌‌పై ధవన్‌‌కు తిరుగులేని రికార్డు ఉంది. వరల్డ్‌‌కప్‌‌లో ఆసీస్‌‌పై సెంచరీ కూడా చేశాడు. మరి కోహ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఈ ముగ్గుర్ని టాప్‌‌ ఆర్డర్‌‌లోనే ఆడిస్తే కోహ్లీ, శ్రేయస్‌‌ వరుసగా నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్‌‌కు వస్తారు. ఇక ఐదో బౌలర్‌‌గా, ఏడో స్థానం కోసం జడేజాను తీసుకోవాలనుకుంటే.. కేదార్‌‌ ఆరో నంబర్‌‌లో బ్యాటింగ్‌‌కు వస్తాడు. అప్పుడు రిషబ్‌‌ పంత్‌‌ బెంచ్‌‌కే పరిమితమైతే. రాహుల్‌‌ కీపింగ్‌‌ చేసే చాన్స్‌‌ ఉంటుంది. అయితే వరుసగా విఫలమవుతున్న కేదార్‌‌కు ఇది ఆఖరి సిరీస్‌‌. ఇందులో రాణిస్తేనే ముందుకెళ్తాడు. లేదంటే ఐపీఎల్‌‌కు పరిమితం కాక తప్పదు. ఎనిమిదో స్థానంలో కూడా బ్యాటింగ్‌‌ కంట్రిబ్యూషన్‌‌ కావాలనుకుంటే శార్దుల్‌‌ ఠాకూర్‌‌ తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు స్టార్‌‌ పేసర్‌‌ బుమ్రాకు తోడుగా షమీ, నవ్‌‌దీప్‌‌లలో ఒకరికే అవకాశం రావొచ్చు. స్పిన్నర్‌‌గా చహల్‌‌ కంటే కుల్దీప్‌‌కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఆసీస్‌‌పై గతంలో హ్యాట్రిక్‌‌ తీయడం ఈ రిస్ట్‌‌ స్పిన్నర్‌‌కు బాగా కలిసిరానుంది. ఓవరాల్‌‌గా బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌లో చేసే మార్పులు.. బలమైన ఆసీస్‌‌ పేస్‌‌ దళాన్ని ఎంత మేరకు అడ్డుకుంటుందో చూడాలి.

లబుషేన్‌‌ @ 4

తుది జట్టుపై ఆసీస్‌‌ కూడా కొద్దిగా డైలమాలోనే ఉంది.  వార్నర్‌‌, ఫించ్‌‌ ఓపెనర్లుగా సత్తా చాటితే మిగతా లైనప్‌‌లో ఎవరున్నా పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఇండియా పిచ్‌‌లపై బుమ్రా బౌలింగ్‌‌ను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మూడో నంబర్‌‌లో స్మిత్‌‌ కన్ఫామ్‌‌. ఈ సీజన్‌‌లో సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్న యంగ్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ లబుషేన్‌‌ను నాలుగో స్థానంలో దించొచ్చు. మిడిలార్డర్‌‌లో హ్యాండ్స్‌‌కోంబ్‌‌, క్యారీపై కూడా భారీ ఆశలు ఉన్నాయి. అయితే ఏడో స్థానంలో అగర్‌‌ను తీసుకోవాలని చూస్తోన్న ఆసీస్‌‌ ఫైనల్‌‌ ఎలెవన్‌‌ను ఎలా బ్యాలెన్స్‌‌ చేస్తుందో చూడాలి. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో.. ఐదుగురు బౌలర్ల ఆప్షన్‌‌కు కట్టుబడితే లోయర్‌‌ ఆర్డర్‌‌ భారీగా పెరుగుతుంది. అప్పుడు నాణ్యమైన బ్యాట్స్‌‌మన్‌‌పై వేటు తప్పదు. ఐపీఎల్‌‌లో కాస్ట్‌‌లీ బౌలర్‌‌గా మారిన కమిన్స్‌‌తో పాటు స్టార్క్‌‌ మంచి ఫామ్‌‌లో ఉండటం ఆసీస్‌‌కు కలిసొచ్చే అంశం. వెన్ను నొప్పి నుంచి కోలుకున్న పేసర్‌‌ హాజిల్‌‌వుడ్‌‌ ఎంత మేరకు ప్రభావం చూపుతాడో చూడాలి.

పిచ్‌‌, వాతావరణం

గ్రాస్‌‌ వికెట్‌‌. బ్యాటింగ్‌‌కు అనుకూలం. హై స్కోరింగ్‌‌ మ్యాస్కోరింగ్‌ మ్యాచ్‌ . మంచు ప్రభావం వల్ల టా స్‌ గెలిస్తే బౌలింగ్‌ తీసుకునే చాన్స్‌ . వర్షం ముప్పులేదు.

Latest Updates