చెత్త గేమ్ ప్లే అన్న నెటిజన్‌‌కు గబ్బర్ ఘాటు రిప్లయ్

సిడ్నీ: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడనే విషయం తెలిసిందే. బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌‌లోనూ అతడు అంతే దూకుడుగా వ్యవహరిస్తాడు. అందుకే ఫ్యాన్స్ అతడ్ని గబ్బర్ అని పిలుస్తారు. ధవన్ అగ్రెసివ్‌‌గానే కాదు టీమ్‌‌మేట్స్‌‌తో, ఫ్యాన్స్‌‌తో చాలా ఫన్నీగానూ ఉంటాడు. అలాంటి ధవన్‌‌కు ఓ అభిమాని చేసిన ట్రోల్ కోపం తెప్పించింది.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం ధవన్ తన సోషల్ మీడియా అకౌంట్‌‌లో పేసర్ దీపక్ చాహర్, లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌‌తో కలసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోకు ‘కళ్లలోని గుడ్లు పీకేసి గోలీలాట ఆడతా’ అనే క్యాప్షన్‌‌ను జత చేశాడు. ఈ పోస్ట్‌‌కు ఓ అభిమాని.. ‘పేడ మొహాలు, చెత్త గేమ్‌‌ ప్లే’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఈ కామెంట్‌‌కు ధవన్ అంతే దీటుగా బదులిచ్చాడు. ‘అవునండి, మీ ఇంట్లో వాళ్లు కూడా మీ గురించి ఇలాగే చెప్పారు’ అని రిప్లయ్ ఇచ్చాడు.

Latest Updates