ఫ్రెండ్లీ‌‌నెస్‌‌ను పక్కనబెట్టి గేమ్‌‌లో కాక పుట్టించండి

ఆస్ట్రేలియా టూర్‌‌ను టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. తొలి రెండు వన్డేల్లో ఓడిపోయి సిరీస్‌‌ను చేజార్చుకుంది. మూడో వన్డే బుధవారం జరగనుంది. మొదటి రెండు మ్యాచులు సాగిన తీరుపై వెటరన్ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అసహనం వ్యక్తం చేశాడు. ఈ సిరీస్‌‌ చాలా ఫ్రెండ్లీగా సాగుతోందని, గేమ్‌‌లో కాక పుట్టించాల్సిన సమయం ఆసన్నమైందని వెటరన్ బౌలర్ జహీర్ ఖాన్ అన్నాడు. ‘ప్లేయర్లు పోరాట స్ఫూర్తితో ఆడాలి. బౌండరీల వద్ద ఫీల్డింగ్ చేస్తూ ఆ తీవ్రతను మళ్లీ తీసుకురావాలి. భారత ఆటగాళ్లలో ఆ తీవ్రతను తీసుకురావడంలో కోచ్ రవిశాస్త్రి సిద్ధహస్తుడని భావిస్తున్నా. ఇది భారీ టూర్ కాబట్టి ఆటగాళ్లలో ఆ ఇంటెన్సిటీని తీసుకురావడానికి శాస్త్రి యత్నించాలి’ అని జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కూడా కామెంట్ చేశాడు.

‘మనం ఆటలో వైవిధ్యమైన శకంలో ఉన్నాం. పది నుంచి ఇరవై ఏళ్ల కింద వరకు గేమ్‌‌ను చూస్కుంటే.. ఆస్ట్రేలియా ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ వైవిధ్యంగా ఉండేది. వాళ్లు టాప్‌‌లో ఉన్నట్లు అనిపించేది కాదు. కానీ వాళ్లు ఆడే తీరు అలా ఉండేది. కానీ ఇప్పుడు చూస్కుంటే.. చాలా మంది ఆసీస్ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. ఐపీఎల్‌‌లో అందరు ప్లేయర్లు కలసి ఆడుతుండటంతో టీమ్‌‌మేట్స్‌‌లా అయిపోయారు. ఈ తేడా ప్రపంచ క్రికెట్‌‌లో కనిపిస్తోంది. మేం ఆడే సమయంలో అలా ఉండేది కాదు. అపోజిషన్ ప్లేయర్లతో మేం టీమ్‌‌మేట్స్‌‌లా ఉండేవాళ్లం కాదు. ఇతర దేశాల ఆటగాళ్లతో ఫ్రెండ్‌‌షిప్‌‌ ఉండేది కాదు’ అని వాన్ చెప్పాడు.

Latest Updates