ఇవాళ రెండో T20: న్యూజిలాండ్ VS టీమిండియా

న్యూజిలాండ్ తో ఇవాళ రెండో టీ ట్వంటీ మ్యాచ్ కు రెడీ అయింది టీమిండియా. మొదటి మ్యాచ్ లో 80 పరుగుల తేడాతో ఓటమి పాలై సిరీస్ లో 1-0తో వెనుకంజలో ఉంది రోహిత్ సేన. ఈ సిరీస్ బరిలో భారత్ నిలవాలంటే ఇవాళ్టి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్  వేదికగా జరుగనున్న మ్యాచ్ లో రెండు జట్లు గెలుపుపై దృష్టి పెట్టాయి. సిరీస్ ను ఇక్కడ కొట్టేయాలనే కసితో కివీస్  సిద్ధమవుతుండగా, మ్యాచ్ ను ఎట్టిపరిస్థితుల్లో కోల్పోకూడదని భారత్  భావిస్తోంది.

తొలి టీ20లో ఎనిమిది మంది బ్యాట్స్ మెన్ తో బరిలోకి దిగినప్పటికీ…ఓటమి నుంచి భారత్ తప్పించుకోలేకపోయింది. అయితే తొలి టీ20 మ్యాచ్ ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేసిన రోహిత్ ఇవాళ జరగాల్సిన మ్యాచ్ లో మార్పులు చేసే అవకాశం ఉంది. ఖలీల్  అహ్మద్ , కృనాల్  పాండ్యాలను తప్పించి వారి స్థానాల్లో చైనామన్  బౌలర్  కుల్దీప్  యాదవ్ , మహ్మద్  సిరాజ్ , సిద్దార్థ్  కౌల్ ను టీమిండియా మరొకసారి పరీక్షించనుంది.

తొలి మ్యాచ్ లో 84 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన టీమిండియా..ఈ మ్యాచ్ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ వేదికగా 11 గంటల  ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభవమవుతుంది.

Latest Updates