‘శత‘క్కొట్టిన రాహుల్.. న్యూజిలాండ్ టార్గెట్ 297

న్యూజిలాండ్ తో జరుగుతున్న ఆఖరి వన్డేలో లోకేష్ రాహుల్ రెచ్చిపోయాడు. సెంచరీతో (113 బంతుల్లో 112) చెలరేగాడు. దీంతో భారత్ 50 ఓవర్లలో  ఏడు వికెట్లు కోల్పోయి 296 పరుగులు చేసింది భారత్. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బతగిలింది. మయాంక్ అగర్వాల్ ఒక పరుగు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ వీరాట్ కోహ్లీ కూడా నిరాశపర్చాడు.  ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.మరో ఒపెనర్  పృథ్వి షా 40 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. నాల్గో స్థానంలో వచ్చిన శ్రేయాస్ అయ్యార్, ఐదో స్థానంలో వచ్చిన రాహుల్ భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. ఇద్దరు కలిసి సెంచరీ పాట్నర్ షిప్ ను నెలకొల్పారు.

శ్రేయాస్ అయ్యార్ 62 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత రాహుల్ నిలకడగా ఆడుతూ సెంచరీ చేసుకున్నాడు. 112 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆరవ స్థానంలో వచ్చిన మనీష్ పాండే 42 పరుగులతో రాణించాడు. రవీంద్ర జడేజా8, శార్దూల్ ఠాకూర్ 7, నవదీప్ షైనీ 8 పరుగులు చేయడంతో భారత్  296 పరుగులు చేసి న్యూజిలాండ్ కు 297 పరుగుల టార్గెట్ ను ముందుంచుంది. న్యూజిలాండ్ బౌలర్లలో బెన్నెట్ కు 4, కైల్ జామిసన్, జేమ్స్ నీషమ్ కు తలో ఒక వికెట్ పడ్డాయి. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి మూడు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తుంది న్యూజిలాండ్. ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది ఇండియా.

Latest Updates