న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా చరిత్ర..సిరీస్ క్లీన్ స్వీప్

న్యూజిలాండ్ తో జరిగిన ఐదో టీ20లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్ పై  7 పరుగులతో విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్ ను ఫస్ట్ టైం వైట్ వాష్ చేసి న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించింది. 164 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు మాత్రమే చేసింది. టిమ్ సెఫర్ట్  50, రాస్ టేలర్ 53  పరుగులతో రాణించినా ఫలితం లేకపోయింది.  లాస్ట్ ఓవర్లో భారత బౌలర్లు అద్భుతం చెలరేగడంతో ఏడు పరుగులతో విజయం సాధించింది. భారత బౌలర్లలో బుమ్రాకు 3, నవదీప్ షైనీ, శార్దూల్ ఠాకూర్ లకు తలో రెండు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ కు ఒక వికెట్ పడ్డాయి.

అంతకు ముందు రోహిత్ శర్మ  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు.  ఓపెనర్లు రాహుల్ 45, రోహిత్ శర్మ 60 పరుగులతో చెలరేగారు. రాహుల్ ఔట్ అయ్యాక కాసేపటికే రోహిత్ కు పిక్క పట్టేయడంతో(60) పరుగులతో రిటైర్డ్ హట్ గా వెనుదిరిగాడు.  శ్రేయస్ అయ్యార్ 33 పరుగులతో రాణించగా భారత్ స్కోరు 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

Latest Updates