ఇండియా, కివీస్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి

వెల్లింగ్టన్ వేదికగా బేసిన్ రిజర్వ్ స్టేడియంలో ఇండియా, న్యూజిలాండ్‌ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకొని, భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కీవిస్ పేస్ బౌలర్ల దాటికి భారత బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. టెస్ట్ మ్యాచ్‌లలో తడబడుతున్న కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 2 పరుగులకే జామిసన్ బౌలింగ్‌లో రాస్ టేలర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. భారత్ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. రహానే, రిషభ్ పంత్ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. అయితే టీ విరామం తర్వాత మ్యాచ్ మొదలుపెట్టేలోగానే వర్షం ప్రారంభమయింది. దాంతో ఈ రోజు మ్యాచ్‌ను అర్థంతరంగా ముగించారు.

మాఫియా డాన్ శివశక్తి నాయుడు ఎన్‌కౌంటర్

మహిళల హాకీ మాజీ కెప్టెన్‌‌కు వరకట్న వేధింపులు

వైరల్ వీడియో: నౌకర్లతో కలిసి ఓనర్ స్టెప్పులు

Latest Updates