టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

విశాఖపట్నలో భారత్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. భారత్ జట్టు ఓపెనర్లుగా  రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ లు క్రీజులోకి దిగారు.

ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య విశాఖ స్టేడియంలో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.  ఓపెనర్లుగా దిగిన  రోహిత్ శర్మ 18(44 బంతులు), మయాంక అగర్వాల్ 22 (53 బంతులు) రన్స్ చేశారు. ప్రస్తుతం స్కోరు 17 ఓవర్లకు  40 రన్స్ గా ఉంది.

ప్రపంచ కప్ తరువాత ఇండియా దేశంలో ఆడుతున్న మొదటి టెస్ట్ కావడంతో విశాఖ స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది.

Latest Updates