నాలుగోరోజు ముగిసిన ఆట: సౌత్ ఆఫ్రికా 11/1

దక్షిణాఫ్రికాతో వైజాగ్ లో జరుగుతున్న  మొదటి టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తుంది. రెండో ఇన్నింగ్స్.. నాలుగోరోజు శనివారం ఆట ముగిసే సమయానికి  సఫారీ టీం ఒక వికెట్ నష్టపోయి 11పరుగులు చేసింది. భారత ఓపెనర్ రోహిత్ శర్మ 127 పరుగులు చేసి తన సత్తా చాటాడు.. రోహిత్ కు తోడుగా.. పుజారా 81పరుగులతో రాణించాడు. సౌత్ ఆఫ్రికాకు భారత్ 395పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన దక్షిణాఫ్రికాను ఆదిలోనే జడేజా దెబ్బకొట్టాడు. సఫరీ ఒపెనర్ ఎల్గర్ ను రెండు రన్స్ కే పెవిలియన్ కు పంపాడు. దీంతో సౌత్ ఆఫ్రికా ఆటముగిసే సమయానికి 11/1 స్కోర్ చేసింది. క్రీజులో మార్ క్రమ్(3), డిబ్రుయిన్(5) పరుగులతో క్రీజులో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా విజయం సాధించాలంటే ఇంకా 384 రన్స్ చేయాల్సి ఉంది.

Latest Updates