లంచ్ బ్రేక్..కష్టాల్లో టీమిండియా

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ఇండియా మూడు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 10, పూజారా డకౌట్, కోహ్లీ 12 పరుగులతో వెంట వెంటనే పెవిలియన్ చేరారు. రోహిత్ నిధానంగా ఆడుతున్నాడు. సౌతాఫ్రికా బౌలర్ రబాడా రెండు వికెట్లు తీసి ఊపు మీదున్నాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి ఇండియా మూడు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసింది. రోహిత్ 38, రహానే 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

Latest Updates