ధర్మశాల వన్డే వర్షార్పణం

ధర్మశాల : సౌతాఫ్రికా-భారత్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా ధర్మశాలలో గురువారం జరగాల్సిన మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు నుంచే వర్షం పడటంతో ఆటను క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపారు అంపైర్లు.

అయితే 2 గంటల తర్వాత వరుణుడు కాస్త తెరిపినిచ్చినప్పటికీ.. స్టేడియం మొత్తం చిత్తడిగా మారింది. దీంతో మ్యాచ్‌ ను నిర్వహించడానికి వీలు లేకుండా ఉందని అంపైర్లు తెలిపారు. టాస్ కూడా వేయకుండా ఆట క్యాన్సిల్ కావడంతో ఫ్యాన్స్ నిరాశతో స్టేడియం నుండి వెళ్లారు. సెకండ్ వన్డే మార్చి-15న లక్నోలో జరగనుంది.

See Alos : 6 నెలలు కష్టంగా గడిచింది

Latest Updates