టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల : సౌతాఫ్రికాతో ఇండియా తొలి పోరు

దుబాయ్‌‌: ఆస్ట్రేలియా వేదికగా వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ షెడ్యూల్‌‌ను ఐసీసీ ప్రకటించింది. సరికొత్త ఫార్మాట్‌‌లో జరగనున్న ఈ టోర్నీలో సూపర్​–12లో గ్రూప్​లో ఉన్న ఇండియా తన తొలి మ్యాచ్‌‌ను సౌతాఫ్రికాతో ఆడనుంది. టాప్10 టీమ్స్‌‌, క్వాలిఫయర్స్‌‌ టీమ్స్‌‌తో మొత్తం 16 జట్లు ఈ మెగాటోర్నీకి అర్హత సాధించాయి. కొత్త ఫార్మాట్​ ప్రకారం ఆరంభంలో బంగ్లాదేశ్‌‌, శ్రీలంకలతో క్వాలిఫయర్‌‌‌‌ టీమ్స్‌‌ను రెండు గ్రూప్‌‌లుగా విభజించారు. ఈ గ్రూప్‌‌ మ్యాచ్‌‌లు 2020 అక్టోబర్‌‌ 18 నుంచి అక్టోబర్‌‌‌‌ 23 వరకు జరుగుతాయి. ఈ రెండు గ్రూప్‌‌ల్లో టాప్‌‌–2గా నిలిచి జట్లు సూపర్‌‌‌‌–12కు అర్హత సాధించి.. టాప్‌‌ –8 జట్లతో తలపడతాయి. ఈ సూపర్‌‌‌‌–12ల్లో టాప్‌‌–4గా నిలిచిన జట్లు నవంబర్‌‌‌‌ 11,12 తేదీల్లో జరిగే సెమీఫైనల్లో తలపడుతాయి. ఇక ఫైనల్‌‌ మ్యాచ్‌‌ మెల్‌‌బోర్న్‌‌ వేదికగా నవంబర్‌‌‌‌ 15న జరగనుంది.

 

Latest Updates