ఫాలో ఆన్.. రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలు

ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఫాలో ఆన్ గా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి  సౌతాఫ్రికా 275 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో  ఇండియాకు 326 పరుగుల ఆధిక్యం ఉంది. దీంతో ఫాలో ఆన్ గా నాల్గో రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ మొదలు పెట్టింది. బ్యాటింగ్ మొదలు పెట్టిన కాసేపటికే సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో మార్ క్రమ్ డకౌట్ అయ్యాడు. థియునిస్ డి బ్రూయిన్ 8 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. ఎల్గర్ 19, డుప్లెసిస్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.  దీంతో ఇంకా 293 పరుగులు వెనుకంజలో ఉంది.

Latest Updates