పంత్, శ్రేయాస్ ఫినిషింగ్ టచ్: విండీస్ టార్గెట్-388

వైజాగ్: సెకండ్ వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 387 స్కోర్ చేసింది. ప్రారంభంలో ఓపెన్లరు రోహిత్ శర్మ(154), కేఎల్ రాహుల్(102) దంచికొడితే..రిషబ్ పంత్(16 బాల్స్ లో 39: 4 సిక్సులు, 3 ఫోర్లు), శ్రేయాస్ అయ్యార్(53: 4సిక్సులు, 3 ఫోర్లు) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

కోహ్లీ డకౌట్ అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన యంగ్ ప్లేయర్లు రిషబ్, శ్రేయాస్ చెలరేగి ఆడారు. వచ్చిన బాల్ ను వచ్చినట్టే సిక్సర్లు, బౌండరీలకు తరలించాడు పంత్. అతడికి తోడు శ్రేయాస్ ఆచితూచి ఆడుతూ అవసరమైనప్పుడు సిక్సర్లు దంచి కొట్టాడు. మొత్తానికి ఫస్ట్ వన్డేలో ఘోరంగా ఓడిన భారత్ కసితీరా కొట్టింది. విండీస్ ముందు బిగ్ టార్గెట్ ను ఉంచింది.

విండీస్ బౌలర్లలో కాట్రెల్(2), పోలార్డ్, జోసెఫ్, పౌల్ తలో వికెట్ తీశారు.

Latest Updates