టాస్ గెలిచిన వెస్టిండీస్.. ఇండియా బ్యాటింగ్

తిరువనంతపురం వేదికగా ఇండియా వర్సెస్ వెస్టిండీస్‌ మధ్య జరగబోయే రెండో టీ20 కాసేపట్లో మొదలు కానుంది. టాస్ గెలిచిన విండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 మ్యాచ్‌కు విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ విజయం కైవసం చేసుకోవాలని చూస్తుంది.

తొలి టీ20లో విఫలమైన వెస్టిండీస్ జట్టు.. టీమ్ లోని నికోలస్ పూరన్ స్థానంలో దేనేష్ రామ్దిన్ బరిలోకి దించనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్‌ని 1-1తో సమం చేయాలని వెస్టిండీస్ ఉవ్విళ్లూరుతోంది. ఉప్పల్ వేదికగా జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఆ జట్టు భావిస్తుంది.

హైదరాబాద్‌లో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది టీమిండియా. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్  1-0తో  ఆధిక్యంలో ఉంది.

టీమిండియా జట్టు:

రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌, దీపక్‌ చాహర్‌, యుజువేంద్ర చాహల్

వెస్టిండీస్ జట్టు:

సిమన్స్‌, లూయిస్‌, కింగ్‌, హెట్‌మెయిర్‌, పొలార్డ్‌ (కెప్టెన్‌), హోల్డర్‌, పూరన్‌, పియర్‌, హేడెన్‌ వాల్ష్‌, విలియమ్స్‌, కాట్రెల్‌

India vs West Indies 2nd T20 : IND to bat, Pooran replaces Ramdin

Latest Updates