చితక్కొట్టిన భారత బ్యాట్స్‌మెన్లు.. విండీస్ టార్గెట్ 241

ముంబైలోని వాంఖడే స్టేడియంలో టీం ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ జట్టు  భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 34 బంతుల్లో 71 పరుగులు(6 ఫోర్లు, 5 సిక్సులు) చేసి ఔటవ్వగా.. రాహుల్ 56 బంతుల్లో 91 పరుగులు(9 ఫోర్లు, 5 సిక్సులు) చేశాడు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సిక్సులతో దుమ్ములేపాడు. 29 బంతులు ఆడిన కోహ్లీ.. 7 సిక్సులు, 4 ఫోర్లతో కలిపి 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.  విండిస్ జట్టు ఈ మ్యాచ్ లో గెలవాలంటే 241 పరుగులు చేయాల్సి ఉంది.

India vs West Indies 3rd T20 Live score: WI need 241 runs to win series

Latest Updates