సాయంత్రమే ఫస్ట్ వన్డే: భారత్ vs వెస్టిండిస్

గుండెలను బద్దలు కొట్టిన  ప్రపంచకప్‌‌ సెమీస్‌‌ వైఫల్యాన్ని పూర్తిగా మర్చిపోకముందే ఇండియా టీమ్‌‌ మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌‌కు సిద్ధమైంది..! హై పెర్ఫామెన్స్‌‌ లైనప్‌‌తో బరిలోకి దిగినా.. కీలక సమయంలో దెబ్బకొట్టిన ‘మిడిల్‌‌’ విభాగాన్ని రిపేర్‌‌ చేసుకునేందుకు కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది..! ఈ నేపథ్యంలో గురువారం నుంచి టీమిండియా.. వెస్టిండీస్‌‌తో మూడు మ్యాచ్‌‌ల వన్డే సిరీస్‌‌ ఆడనుంది..! దీంతో మిడిలార్డర్‌‌లో స్థానాన్ని ఒడిసిపట్టుకోవాలని కలలుగంటున్న కుర్రాళ్లకు ఇది సువర్ణావకాశం..! చాన్స్‌‌ వచ్చినా వినియోగించుకోలేకపోయిన అనుభవజ్ఞులకు ఇది ఆఖరి అవకాశం..! ఎవరు ఏ స్థానానికి సరిపోతారో తేల్చాలని భావిస్తున్న టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌కూ ఇది మంచి అవకాశం..! మరి ఇందులో గట్టెక్కెదెవరు..? కీలకమైన ‘నాలుగు’కు సరిపోయేదెవరు? కరీబియన్‌‌ వీరుల ‘పేస్‌‌’ మంత్రానికి నిలిచి గెలిచేదెవరు? వీటన్నింటిని పక్కనబెడితే ‘యూనివర్స్​ బాస్‌‌’ క్రిస్‌‌ గేల్‌‌కు ఇది వీడ్కోలు సిరీస్‌‌ కావడం మరింత ఆసక్తిని పెంచింది..!!

 

ధనాధన్‌‌ పోరాటంతో పొట్టి ఫార్మాట్‌‌ సిరీస్‌‌ను క్లీన్‌‌స్వీప్‌‌ (3–0) చేసిన టీమిండియా… ఇప్పుడు వన్డే సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా గురువారం జరిగే తొలి మ్యాచ్‌‌లో విండీస్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. వరల్డ్‌‌కప్‌‌ వైఫ్యలాన్ని మర్చిపోవాలంటే ఈ సిరీస్‌‌ను కచ్చితంగా గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్న విరాట్‌‌సేన అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను సిద్ధం చేస్తోంది. అందుబాటులో ఉన్న కుర్రాళ్లలో అత్యత్తుమ ప్లేయర్లను ఎంపిక చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు టీ20 సిరీస్‌‌ చేజార్చుకున్న కరీబియన్లు కసిమీదున్నారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసిపట్టుకుని లెక్క సరి చేయాలని భావిస్తున్నారు. పేపర్‌‌ మీద ఇరుజట్ల బలాబలాలు సమానంగా కనిపిస్తున్నా.. ప్రస్తుత ఫామ్‌‌ ప్రకారం విరాట్‌‌సేన కాస్త ఫేవరెట్‌‌గా కనిపిస్తున్నది. అయితే ఎప్పుడు ఎలా ఆడతారో తెలియని విండీస్‌‌ వీరులకు సొంతగడ్డ అనుకూలత ప్లస్‌‌ పాయింట్‌‌. ఏదేమైనా రెండు టీమ్‌‌లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతుండటం అభిమానులకు మరింత వినోదాన్ని పంచే విషయం.

4లో రాహుల్‌‌?

ఈ సిరీస్‌‌ ముగిసేలోగా మిడిలార్డర్‌‌ను బాగు చేసుకోవడమే టార్గెట్‌‌గా పెట్టుకున్న టీమిండియా అందుకు పకడ్బంది ప్రణాళికలు రూపొందించింది. వరల్డ్‌‌కప్‌‌లో గాయపడిన ధవన్‌‌ తిరిగి రావడంతో.. కేఎల్‌‌ రాహుల్‌‌ మళ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌ చేసే అవకాశం ఉంది. ఈ మూడు మ్యాచ్‌‌ల్లోనూ అతన్ని ఇలాగే కొనసాగిస్తారా? లేక కొత్త వారికి అవకాశం ఇస్తారా? అన్నది చూడాలి. ప్రస్తుత లైనప్‌‌లో థర్డ్‌‌ బెస్ట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ అయిన ధవన్‌‌ 130 వన్డేల్లో 17 సెంచరీలు బాదాడు. కానీ గత మూడు టీ20ల్లోనూ అతను నిరాశపర్చడం ఆందోళన కలిగిస్తోంది. అయితే టాప్‌‌ ఆర్డర్‌‌లో ధవన్‌‌–రోహిత్‌‌ జంటను విడదీయలేని పరిస్థితి. ఆరంభంలో ఈ ఇద్దరు ధనాధన్‌‌గా బాదడం.. వన్‌‌డౌన్‌‌లో కోహ్లీ వచ్చి భారీ స్కోరు అందించడం… గత కొంతకాలంగా వస్తున్న ఆనవాయితీ ఇది. కాబట్టి ఇప్పుడు కూడా ఇదే కొనసాగనుంది. వీటిని పక్కనబెడితే అసలు సమస్య 4, 5, 6లో ఆడే ఆటగాళ్ల గురించే. ప్రస్తుతానికి రాహుల్‌‌ను నాలుగులో దించితే, 5 లేదా 6వ స్థానంలో కేదార్‌‌కు చాన్స్‌‌ ఇవ్వొచ్చు. రిషబ్‌‌ పంత్‌‌ను ఫ్లోటర్‌‌గా ఉపయోగించుకుంటే జాదవ్‌‌ స్థానం అటుఇటు మారుతుంది. మిగిలిన ఏడో స్థానానికి మనీష్‌‌ పాండే, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ మధ్య పోటీ నెలకొంది. రెండో ఫార్ములా ప్రకారం జాదవ్‌‌ను పక్కనబెట్టి పాండే, అయ్యర్‌‌ను ఆడించడం. ఇందులో విరాట్‌‌ దేనికి మొగ్గుతాడో చూడాలి. బౌలింగ్‌‌లో మూడు టీ20లు ఆడిన భువనేశ్వర్‌‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. సైనీకి అరంగేట్రం చాన్స్‌‌ ఇస్తే షమీతో కలిసి కొత్త బంతిని పంచుకోనున్నాడు. ముగ్గురు పేసర్ల వ్యూహం అయితే ఖలీల్‌‌ అహ్మద్‌‌కు అవకాశం రావొచ్చు. మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్‌‌, చహల్‌‌ తుది జట్టులో ఉండొచ్చు. కానీ బ్యాటింగ్‌‌ బలోపేతం చేయాలంటే ఆల్‌‌రౌండర్‌‌గా జడేజాను తీసుకుంటారు. కేదార్‌‌ను పార్ట్‌‌ టైమర్‌‌గా ఉపయోగించుకునే  చాన్సుంది.

గేల్‌‌కు చివరి సిరీస్‌‌..!

బౌలింగ్‌‌లో బలంగా కనిపిస్తున్న విండీస్‌‌ బ్యాటింగ్‌‌ వైఫల్యంతో టీ20 సిరీస్‌‌ను చేజార్చుకుంది. దీంతో వన్డేలకు క్రిస్‌‌ గేల్‌‌ను తీసుకొచ్చారు. అతనికి ఇదే ఆఖరి సిరీస్‌‌ కూడా. కాబట్టి సొంతగడ్డపై విండీస్‌‌కు సిరీస్‌‌ అందించి ఘనంగా కెరీర్‌‌ను ముగించాలని ఈ ‘యూనివర్స్’ బాస్‌‌ భావిస్తున్నాడు. ఓపెనింగ్‌‌లో గేల్‌‌ చెలరేగితే ఇండియా కుర్ర బౌలర్లకు కష్టాలు తప్పవు. ఓపెనర్‌‌ క్యాంప్‌‌బెల్‌‌, రోస్టన్‌‌ ఛేజ్‌‌, ఆల్‌‌రౌండర్‌‌ కీమో పాల్‌‌ను తిరిగి జట్టులోకి తీసుకోవడం అనుకూలాంశం. అయితే ఇన్నింగ్స్‌‌ను ఆరంభించడంలో గేల్‌‌కు సరి జోడీ ఎవరనేది తేలాలి. మిడిలార్డర్‌‌లో హోప్‌‌, హెట్‌‌మయర్‌‌, పూరన్‌‌పై భారీ అంచనాలున్నాయి. టీమ్‌‌లో ఉన్న  ఏకైక స్పిన్నర్‌‌ ఛేజ్‌‌ ఏడో స్థానంలో రానున్నాడు. హోల్డర్‌‌, థామస్‌‌, కొట్రెల్‌‌, రోచ్‌‌, పాల్‌‌తో కూడిన బలమైన పేస్‌‌ బౌలింగ్‌‌ ఉండటం విండీస్‌‌కు బాగా కలిసొచ్చే అంశం.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌‌‌), ధవన్‌‌‌‌, రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌, కేదార్‌‌‌‌ / మనీష్‌‌‌‌ / శ్రేయస్‌‌‌‌, రిషబ్‌‌‌‌, జడేజా, భువనేశ్వర్‌‌‌‌,  షమీ, సైనీ/ ఖలీల్‌‌‌‌.  చహల్‌‌‌‌/ కుల్దీప్‌‌‌‌.

వెస్టిండీస్‌‌‌‌: హోల్డర్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), గేల్‌‌‌‌, లూయిస్‌‌‌‌ / క్యాంప్‌‌‌‌బెల్‌‌‌‌, హోప్‌‌‌‌, హెట్‌‌‌‌మయర్‌‌‌‌, పూరన్‌‌‌‌, ఛేజ్‌‌‌‌, పాల్‌‌‌‌, రోచ్‌‌‌‌, థామస్‌‌‌‌, కొట్రెల్‌‌‌‌.

పిచ్‌‌‌‌, వాతావరణం

మూడో టీ20లాగా మందకొడి పిచ్‌‌‌‌. ఆరంభంలో బౌలర్లకు అనుకూలం. వికెట్‌‌‌‌ స్లో గా మారుతుండటం వల్ల ఛేజింగ్‌‌‌‌ కొద్దిగా కష్టం. ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేస్తే ఓ మాదిరి లక్ష్యాన్ని పెట్టొచ్చు. ఉదయం చిరుజల్లులు పడే అవకాశం ఉంది.

రా. 7 నుంచి సోనీ టెన్‌‌‌‌లో

వన్డేల్లో బ్రియాన్‌‌ లారా (10,405) రన్స్‌‌ను సమం చేసేందుకు గేల్‌‌ చేయాల్సిన పరుగులు.

వన్డేల్లో వంద వికెట్ల క్లబ్​లో చేరేందుకు కుల్దీప్​​కు అవస రమైన వికెట్లు. 51 వన్డేలాడిన కుల్దీప్​ ఖాతాలో 93 వికెట్లు న్నాయి.  మరో 4 మ్యాచ్​ల్లో

7 వికెట్లు తీస్తే వేగంగా 100 వికెట్లు పడగొట్టిన షమీ రికార్డును బ్రేక్​ చేస్తాడు.

Latest Updates