వెస్టిండిస్ తో తొలి T20… భారత్ టార్గెట్ 208

ఉప్పల్ వేదికగా జరుగుతున్న మూడు T20 సిరీస్ లో భాగంగా.. మొదటి మ్యాచ్ లో భారత్ కు వెస్టిండిస్ 208 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. వెస్టిండిస్ బ్యాట్స్ మెన్ లలో హెట్‌మైర్(56), లూయిస్‌(40), పొలార్డ్‌(37) చెలరేగారు. జాసన్ చివరి ఓవర్లో 9బంతుల్లో 24పరుగులు రాబట్టుకున్నాడు. ఏకంగా 15సిక్సులు కొట్టారు. మ్యాచ్ మొదటి నుంచి విస్టిండిస్ దూకుడైన ఆటను ప్రదర్శించింది. అయితే రెండో ఓవర్లోనే చాహర్ బౌటింగ్ లో ఓపెనర్ లెండిల్ సిమన్స్ రెండు పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్రాండన్ కింగ్ 31పరుగులు చేశాడు.  భారత బౌలర్లలో చాహాల్ రెండు, జడేజా, చహర్‌, సుందర్‌లు తలో వికెట్‌ పడగొట్టారు.

Latest Updates