విశాఖ టెస్ట్ : సౌతాఫ్రికాపై భారత్ గ్రాండ్ విక్టరీ

విశాఖ టెస్ట్ లో భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.  సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలి ఇన్సింగ్స్ లో 502 పరుగులకు డిక్లేర్ చేయగా…సౌతాఫ్రికా 431 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్సింగ్స్ లో ఇండియా 323 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది.

395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికాను 191 పరుగులకే కట్టడి చేసింది. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ 7 వికెట్లతో రాణించగా..రెండో ఇన్నింగ్స్ లో పేస్ బౌలర్ షమీ 5 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఈ టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ రోహిత్ శర్మ సెంచరీలు చేయగా… తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ విజయంతో భారత్ మూడు టెస్టుల సిరీస్ లో 1-0 అధిక్యం సాధించింది.

Latest Updates